INDW VS AUSW : వరల్డ్ కప్‌లో తాను బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని చాటుతూ సెంచరీతో చెలరేగింది జెమీమా రోడ్రిగ్స్(106 నాటౌట్). సింగిల్ తీసిన జెమీమా.. వన్డేల్లో మూడో శతకం సాధించింది. రెండో ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన తను.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(89)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. ఆ తర్వాత రీచా ఘోష్(8 నాటౌట్))తో కలిసి జట్టును గెలిపించేందుకు పోరాడుతోంది. ప్రస్తుతం టీమిండియా స్కోర్.. 284–4. ఇంకా విజయానికి 55 పరుగులు కావాలి.
𝙅𝙚𝙢 of a knock 💯
3️⃣rd ODI HUNDRED for Jemimah Rodrigues 🔥
She continues to fight for #TeamIndia 🫡
Updates ▶ https://t.co/ou9H5gN60l#WomenInBlue | #CWC25 | #INDvAUS | @JemiRodrigues pic.twitter.com/3QweHnijcg
— BCCI Women (@BCCIWomen) October 30, 2025
ఎనిమిదేళ్ల క్రితం ఆసీస్‌పై సెమీ ఫైనల్లో శతకంతో (171 రన్స్)తో రెచ్చిపోయిన కౌర్ ఈసారి కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడింది. కూల్‌గా ఆడుతూ స్కోర్‌బోర్డును ఉరికిస్తున్న కౌర్ కెరీర్లో 21వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. జెమీమా రోడ్రిగ్స్(106 నాటౌట్) తో కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పింది ఇండియన్ కెప్టెన్. వీరిద్దరూ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ.. బౌండరీలు రాబడుతూ స్కోర్ 200 దాటించారు. రెండు సిక్సర్లు బాదిన హర్మన్‌ప్రీత్.. సథర్లాండ్ వేసిన షార్ట్ పిచ్ బంతికి పెద్ద షాట్ ఆడి గార్డ్నర్ చేతికి చిక్కింది. దాంతో..167 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం కాసేపు స్వీప్ షాట్లతో అలరించిన దీప్తి శర్మ(24) అనూహ్యంగా రనౌటయ్యింది.