INDW vs SAW : వైజాగ్‌లో చెలరేగిపోతారనుకుంటే భారత బ్యాటర్లు డగౌట్‌కు క్యూ కడుతున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికారేస్తారనుకుంటే పేలవ షాట్లతో వికెట్లు సమర్పించుకుంటున్నారు. ఓపెనర్ ప్రతీకా రావల్ (37) తర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ డకౌట్ అయింది. చోలే ట్రయాన్ వేసిన 21వ ఓవర్లో నాలుగో బంతికి స్వీప్ షాట్ ఆడబోయిన ఆమె ఎల్బీగా వెనుదిరిగింది. దాంతో.. 92 వద్ద టీమిండియా నాలుగో వికెట్ పడింది. ప్రస్తుతం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(3 నాటౌట్), దీప్తి శర్మలు క్రీజులో ఉన్నారు. వీరిద్దరు కనీసం అర్ధ శతకం భాగస్వామ్యం అయినా నెలకొల్పితేనే భారత్ మెరుగైన స్థితిలో నిలిచే అవకాశముంది.
మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత ఓపెనర్లు మరోసారి నిరాశపరిచారు. శుభారంభం లభించినా స్మృతి మంధాన (23) స్వల్ప స్కోర్‌కే వెనుదిరగగా.. దూకుడుగా ఆడే క్రమంలో ప్రతీకా రావల్(37) వికెట్ కోల్పోయింది. అనంతరం వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ బాధ్యతగా ఆడాల్సింది పోయి ఎల్బీగా వెనుదిరిగింది. చోలే ట్రయాన్ ఓవర్లో స్వీప్‌షాట్‌కు యత్నించిన తను వికెట్ సమర్పించుకుంది. 92కే నాలుగు వికెట్లు పడడంతో.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించే పనిలో నిమగ్నమెంది.
🟦 Jemimah Rodrigues is out for her second duck of the tournament
🟦 This is her second-consecutive wicket while attempting a sweep shot
🟦 Every dismissal she’s had so far in this World Cup has been to left-arm spin
🟦 India have now lost 10 wickets to left-arm spin, the most… pic.twitter.com/kAatSHb6tK
— ESPNcricinfo (@ESPNcricinfo) October 9, 2025