Para Athletics Championships : స్వదేశంలో జరుగుతున్న పారా అథ్లిటిక్స్ ఛాంపియన్షిప్స్ (Para Athletics Championships)లో భారత స్టార్లు పతకాల పంట పండిస్తున్నారు. జావెలిన్ త్రోలో రింకూ హుడా (Rinku Hooda) పసిడి పతకం సాధించాడు. దేశానికి రెండో స్వర్ణం అందించాడు. సుందర్ సింగ్ గుర్జర్ రెండో స్థానంతో రజతం పట్టేశాడు. తద్వారా భారత్ ఖాతాలో ఐదో పతకం చేరింది.
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మంగళవారం జరిగిన జావెలిన్ త్రో ఎఫ్ 46 ఫైనల్లో రింకూ ఏకంగా 66.37 మీటర్ల దూరం ఈటెను విసిరాడు. ఒకవేళ అతడు 68.60 మీటర్లకు చేరుకుంటే.. ప్రపంచ రికార్డును అధిగమించేవాడు. కానీ, ఐదో ప్రయత్నంలో 64.76 మీటర్లకే పరిమితం అయ్యాడు రింకూ. భారత్‌కే చెందిన అజీత్ సింగ్ యాదవ్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. క్యూబాకు చెందిన గులెర్మో వరొనా గొంజాలెజ్ (63.34 మీటర్లు) కాంస్యం ఎగరేసుకుపోయాడు.
Para Athletics, World Championships: Rinku Hooda! what a story! Years of disappointment of not being able to win🥇at the WChs (won🥈couple of times) & Paralympics (placed 5th in 2016 & 2024), he’s crowned World champion in JT (F46 cat) in New Delhi!
Well done Rinku!!!
👏🇮🇳🥇 pic.twitter.com/ONM09ArqWH
— Vishank Razdan (@VishankRazdan) September 29, 2025
రింకూ హుడా పదేళ్ల రికార్డును బద్ధలు కొట్టాడు. చైనా అథ్లెట్ సీ.గువో 61.89 మీటర్ల దూరంతో ఈ రికార్డును సాధించాడు. చెక్కు చెదరకుండా ఉన్న 63.81 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ కొల్లగొట్టాడు. గతంలో ఈ పోటీల్లో రెండుపర్యాయాలు కాంస్యంతో మెరిసిన సుందర్ మూడో ప్రయత్నంలో 64.11 మీటర్ల దూరం ఈటెను విసిరాడు.