Team India Vs Australia | బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా చెత్త రికార్డు
Team India Vs Australia | ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. రాజ్ కోట్ వేదికగా మూడో మ్యాచ్‌లో బుమ్రా 10 ఓవర్లలో 81 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ వన్డేల్లో బుమ్రాకు ఇదే చెత్త ప్రదర్శన.
Team India Vs Australia | ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో భారత స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. గాయం నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చిన అనంతరం మునుపటి వేగంతో పాటు.. కచ్చితత్వంతో వికెట్లు పడగొడుతున్న ఈ పేసుగుర్రం.. రాజ్ కోట్ వేదికగా మూడో మ్యాచ్‌లో చెత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. బ్యాటింగ్‌కు స్వర్గధామంలా మారిన ఈ పిచ్‌పై బుమ్రా 10 ఓవర్లలో 81 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ వన్డేల్లో బుమ్రాకు ఇదే చెత్త ప్రదర్శన. 2017లోనూ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో బుమ్రా 9 ఓవర్లలో 81 పరుగులు సమర్పించుకున్నాడు. ఇతర బౌలర్లు వన్డేల్లో 10 ఓవర్లలో ప్రత్యర్థికి 70 పరుగులు సమర్పించుకోవడం పెద్ద విషయం కాకపోయినా.. ఎకానమీలో అత్యుత్తమమైన బుమ్రా మాత్రం ఇలా చేయడం కెరీర్లో ఐదోసారి మాత్రమే.
తాజా మ్యాచ్ తొలి స్పెల్‌లో బుమ్రా తేలిపోయాడు. కంగారూ బ్యాటర్ల ధాటికి తన తొలి 5 ఓవర్లలో ఈ ముంబైకర్ 51 పరుగులు ఇచ్చుకున్నాడు. అయితే చివర్లో కట్టుదిట్టమైన బంతులతో చెలరేగిన బుమ్రా మూడు వికెట్లు పడగొట్టి భళా అనిపించుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. చివరకు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), మిషెల్ మార్ష్ (84 బంతుల్లో 96; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టుకు మెరుగైన ఆరంభాన్నివ్వగా.. స్టీవ్ స్మిత్ (74; 8 ఫోర్లు, ఒక సిక్సర్), మార్నస్ లబుషేన్ (72; 9 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించారు. ఫలితంగా ఆసీస్ భారీ స్కోరు చేయగలిగింది. గత మ్యాచ్‌లో కొండంత లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన కంగారూలు ఈ సారి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. టీమ్ఇండియా బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

