Bumrah vs Hardik: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్‌లో సారథ్య మార్పు మంటలు ఇంకా చల్లారలేదు. కొద్దిరోజుల క్రితమే ముంబై జట్టు.. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను హార్ధిక్ పాండ్యాకు అప్పజెప్పడాన్ని ముంబై సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబై హార్ధిక్‌ను కెప్టెన్‌గా అనౌన్స్ చేయగానే ఆ జట్టులోని సీనియర్ ఆటగాళ్లు జస్ఫ్రిత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లు ట్విటర్ (ఎక్స్) వేదికగా తమ అసహనంతో పాటు కోపాన్ని వెల్లడించారు. బుమ్రా అయితే ముంబై ఇండియన్స్ ట్విటర్ ఖాతాను అన్‌ఫాలో చేశాడు. తాజాగా అతడు ముంబై కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను కూడా ట్విటర్లో అన్‌ఫాలో చేసినట్టు సమాచారం.
హార్ధిక్ ట్విటర్ ఖాతాను బుమ్రా అన్‌ఫాలో చేయడంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌తో బుమ్రాకు విభేధాలున్నాయంటూ కొన్నాళ్లుగా వస్తున్న అనుమానాలకు ఆజ్యం పోసినట్టు అయిందని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ట్విటర్లో హార్ధిక్‌ను అన్‌ఫాలో చేసిన బుమ్రా.. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఫాలో అవుతున్నాడు. రోహిత్ తర్వాత కెప్టెన్సీ రేసులో ముందువరుసలో ఉండే బుమ్రా.. హార్ధిక్ సారథ్యంలో ఆడేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదని గత కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
📍 Breaking & Shocking 📍
Jasprit Bumrah Has Un-followed Mumbai Indians On Twitter.
Mumbai Indians Is Still Following Jasprit Bumrah.
Jasrpit Bumrah Has Also Un-followed Hardik Pandya On Twitter. pic.twitter.com/JoXodzhY9E
— Vaibhav Bhola 🇮🇳 (@VibhuBhola) February 13, 2024
బుమ్రా కథ ఇలా ఉంటే ఇటీవలే ముంబై హెడ్‌కోచ్ మార్క్ బౌచర్.. రోహిత్ శర్మపై చేసిన వ్యాఖ్యలు, దానికి హిట్‌మ్యాన్ భార్య రితికా ఇచ్చిన రిప్లై ఆ జట్టులో అంతర్గత విభేదాలున్నాయనేది చెప్పకనే చెబుతోంది. రోహిత్ కూడా ముంబైని వీడతాడన్న వార్తలూ హార్ధిక్ కెప్టెన్ అయినప్పట్నుంచీ చక్కర్లు కొడుతున్నాయి. ఐపీఎల్ ఆరంభానికి సుమారు నెలరోజుల సమయమే మిగిలుండగా జట్టులో అంతర్గత విభేదాలు ఆ జట్టును ఏ దిశగా నడిపిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. 2022లో గుజరాత్ టైటాన్స్‌కు సారథిగా నియమితుడైన హార్ధిక్ పాండ్యా.. రెండు సీజన్ల తర్వాత తిరిగి ముంబైకి తిరిగొచ్చాడు. రెండేండ్ల కాంట్రాక్టులో భాగంగా అతడు ముంబై అతడికి సారథ్య పగ్గాలు అప్పజెప్పింది.