Jasprit Bumrah : వరల్డ్ కప్ షెడ్యూల్(ICC ODI WC 2023) రావడంతో అందరి కళ్లు భారత జట్టు పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)పైనే నిలిచాయి. టోర్నీ సమయానికి ఈ యార్కర్ కింగ్(Yorker King) ఫిట్నెస్ సాధిస్తాడా? లేదా?, భారత జట్టులో కీలకమైన అతడు లేకుంటే ఎట్లా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే.. వెన్నెముక గాయం నుంచి కోలుకుంటున్న బుమ్రా త్వరలోనే మైదానంలోకి దిగనున్నాడు. ప్రస్తుతం బెంగళూరలోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో ఉన్న బుమ్రా నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు.
రోజూ ఏడు ఓవర్లు వేస్తూ ఫిట్నెస్ మెరుగుపరుచుకుంటున్నాడు. మరో విషయం ఏంటంటే..? ఈ స్పీడ్‌స్టర్ జూలైలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఈ విషయాన్ని ఎన్సీఏ ప్రతినిధులు ఈ రోజు వెల్లడించారు. నెట్స్‌లో బుమ్రా ఏడు ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడు. వర్క్‌లోడ్ విషయంలో రోజు రోజుకు మెరుగువుతున్నాడు. అతను వచ్చే నెలలో కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడునున్నాడు అని ఎన్సీఏ వర్గాలు అంటున్నాయి. బీసీసీఐ(BCCI) ఇప్పటికే బమ్రా కోసం ఐర్లాండ్(Ireland)తో టీ20 సిరీస్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఆగస్టులో భారత జట్టు ఐర్లాండ్ పర్యటనలో మూడు టీ20లు ఆడనుంది.
టీ20 బౌలర్‌గా జట్టులోకి వచ్చిన బుమ్రా అనతికాలంలోనే కీలక బౌలర్‌గా ఎదిగాడు. వన్డే, టెస్టుల్లో స్థానం పదిలపరుచుకున్నాడు. అలాంటిది అతను.. గత ఏడాది ఆసియాకప్ ముందు వెన్నెముక గాయంతో పలు టోర్నీలకు దూరమయ్యాడు. టీ20 వరల్డ్ కప్, ఆసీస్‌తో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఆడలేదు. ఈ సమయంలోనే బీసీసీఐ ఈ స్టార్ పేసర్‌ను సర్జరీ కోసం న్యూజిలాండ్ పంపింది. ఆ తర్వాత భారత్ వచ్చిన బుమ్రా బెంగళూరులోని ఎన్సీఏలో ఉంటున్నాడు. వన్డే వరల్డ్ కప్‌లోపు అతను ఫిట్నెస్ సాధించాలని బీసీసీఐతో సహా సగటు అభిమానులంతా కోరకుంటున్నారు.