ముంబై: ఐపీఎల్-18వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లలో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు బౌలింగ్ కష్టాలు తప్పేలా లేవు. ఆ జట్టు స్టార్ పేసర్ బుమ్రా ముంబై ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలున్నాయి.
ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వెన్ను గాయమై ఇటీవలే కోలుకుంటున్న బుమ్రా.. మరికొద్దిరోజుల పాటు బౌలింగ్ వేయకపోవడమే మంచిదని బీసీసీఐ, ఎన్సీఏ అధికారులు సూచించినట్టు తెలుస్తోంది.