Jasprit Bumrah : భారత జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) కమ్‌బ్యాక్‌లో అదరగొట్టాడు. 11 నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన బుమ్రా ఐర్లాండ్(Ireland)పై తొలి టీ20లో దుమ్మురేపాడు. రెండు వికెట్లు తీసి తనలో చేవ తగ్గలేదని నిరూపించాడు. అంతేకాదు ఏమంత కష్టం అనిపించుకుండానే బౌలింగ్ చేశాడు. అయితే.. ఇదంతా అతడి బౌలింగ్ యాక్షన్‌లో మార్పుల వల్లనే అని నేషనల్ క్రికెట్ అకాడమీ అధికారులు చెప్పుతున్నారు.
‘స్ట్రెస్ ఫ్రాక్చర్‌కు ముందు బుమ్రా బౌలింగ్ వీడియోలు జాగ్రత్తగా గమనిస్తే… అతను వేగంగా ఆరు లేదా ఏడు అడుగులు వేసి బౌలింగ్‌కు సిద్ధమయ్యేవాడు. వేగంగా పరుగెత్తుకొచ్చి ఏడో అడుగు పడేలోపు బంతిని సంధించేవాడు. కానీ, ఐర్లాండ్‌పై మాత్రం మునపటి కంటే రెండు, మూడడుగులు ఎక్కువ వేసి బౌలింగ్ చేశాడు. దాంతో, శరీరంపై ఎక్కువ ఒత్తిడి పడకుండా, గాయాల పాలవ్వకుండా అతను యాక్షన్‌ను మార్చుకున్నాడు. అందువల్ల బుమ్రా దీర్ఘకాలం జట్టుకు సేవలందించనున్నాడు’ అని ఎన్సీఏ లెవల్ త్రీ సర్టిఫైడ్ కోచ్ వెల్లడించాడు.
Double-success in the very first over!
And it’s the #TeamIndia Captain @Jaspritbumrah93 who strikes twice with the new ball ⚡️⚡️
Ireland 13/2 after 3 overs.
Follow the match ▶️ https://t.co/cv6nsnJY3m… #IREvIND pic.twitter.com/afkP2NcnI5
— BCCI (@BCCI) August 18, 2023
నిరుడు సెప్టెంబర్‌లో ఆటకు దూరమైన బుమ్రా న్యూజిలాండ్‌లో సర్జరీ చేయించుకున్నాడు. ఆ తర్వాత బెంగళూరులోని ఎన్సీఏలో కోలుకుంటూనే ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. రోజుకు గంటల కొద్దీ నెట్స్‌లో శ్రమించాడు. ఫిట్నెస్ సాధించాక అతడిని ఐర్లాండ్ సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. దాంతో, బుమ్రా 10 నెలల 23 రోజుల తర్వాత టీమిండియా జెర్సీ వేసుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటి కోట్లాది మంది భారత అభిమానులను ఖుషీ చేశాడు. డబ్లిన్ వేదికగా జరిగిన మొదటి టీ20లో ఐర్లాండ్ 7 వికెట్ల నష్టానికి 139 రన్స్ కొట్టింది. 4 ఓవర్లు వేసిన బుమ్రా 24 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఆడిన భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం గెలుపొందింది.