Jaspreet Bumrah | యార్కర్ కింగ్ ఒడిలో చిన్నారి బుమ్రా.. ఫొటో వైరల్
Jaspreet Bumrah : వరల్డ్ కప్ ముగియడంతో భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jaspreet Bumrah) కుటుంబంతో గడుపుతున్నాడు. తీరిక దొరకడంతో ఈ స్పీడ్‌స్టర్ తన కుమారుడు అంగద్ని ఎత్తుకొని మురిసిపోతున్నాడు. శుక్రవారం బుమ్రా తమ చిన్నారిని ప్రేమగా చేతుల్లోకి తీసుకొని నవ్వుతూ....
Jaspreet Bumrah : వరల్డ్ కప్ ముగియడంతో భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jaspreet Bumrah) కుటుంబంతో గడుపుతున్నాడు. తీరిక దొరకడంతో ఈ స్పీడ్‌స్టర్ తన కుమారుడు అంగద్ని ఎత్తుకొని మురిసిపోతున్నాడు. శుక్రవారం బుమ్రా తమ చిన్నారిని ప్రేమగా చేతుల్లోకి తీసుకొని నవ్వుతూ కనిపించాడు. అదే ఫొటోను సోషల్ మీడియాలో పెట్టిన బుమ్రా.. కుమారుడి ముఖాన్ని మాత్రం సూర్యుడి ఎమోజీతో కవర్ చేశాడు.
దానికి ‘నా చిన్నారి సూర్యకిరణం’ అంటూ ఆ ఫొటోకు బుమ్రా క్యాప్షన్ పెట్టాడు. ఆ ఫొటోకు అతడి భార్య సంజనా గణేశన్(Sanjana Ganeshan) ‘నా ఫేవరేట్ బాయ్స్’ అని కామెంట్ రాసింది. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టిట తెగ వైరల్ అవుతోంది.
బుమ్రా.. 2021 మార్చిలో స్పోర్ట్స్ ప్రజెంటర్ అయిన సంజనను పెండ్లి చేసుకున్నాడు. ఆ రోజు నుంచి వాళ్ల జంట సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. అంతేకాదు సంజన తన భర్త బుమ్రాతో ఒక ఇంటర్వ్యూ కూడా చేసింది. ఈ ఏడాది ఆరంభంలో బుమ్రా తాము తల్లిదండ్రలు కోబుతున్నట్టు ప్రకటించాడు. సెప్టెంబర్ 4వ తేదీన సంజన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

నిరుడు టీ20 వరల్డ్ కప్ ముందు గాయపడిన బుమ్రా 2023లో పలు కీలక టోర్నీలకు దూరమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రాటుదేలిన బుమ్రా ఐర్లాండ్ సిరీస్‌తో రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీలంక, పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చిన ఆసియా కప్‌లో ఈ యార్కర్ కింగ్ అదరగొట్టాడు. వన్డే ప్రపంచ కప్‌లో షమీతో పాటు భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే.. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌కు బీసీసీఐ బుమ్రాతో పాటు షమీకి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
-
Earthquake | హర్యానా, అస్సాంలో స్వల్పంగా కంపించిన భూమి.. 3.0 తీవ్రత
-
Mohammad Shami | శభాష్ షమీ.. లోయలో పడిన కారులోని వ్యక్తిని కాపాడిన భారత పేసర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

