దుబాయ్: టీమిండియాతో జరిగే టీ20 క్రికెట్ మ్యాచ్ కోసం జపాన్(Japan) తన జట్టును ప్రకటించింది. లీడింగ్ స్కోరర్‌గా ఉన్న కెండిల్ కడోవాకి ఫ్లెమింగ్‌కు జపాన్ సారథ్య బాధ్యతలు అప్పగించారు. సెప్టెంబర్ 22వ తేదీన సానోలో జరిగే మ్యాచ్‌కు అతను నాయకత్వం వహించనున్నాడు. అయితే అయిచి నగోయాలో జరిగే ఆసియా గేమ్స్‌కు కూడా అతనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. జపాన్ జట్టులో ఇద్దరు అనుభవం ఉన్న ప్లేయర్లు ఉన్నారు. ఇబ్రహీం తకహషి, డెక్లన్ సుజుకి మెక్‌కాంబ్ ప్లేయర్లకు టీ20ల్లో 50 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్నట్లు ఐసీసీ తన ప్రకటనలో తెలిపింది. సుజుకీ కప్ పేరుతో ఆ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు.
భారత్, జపాన్ మధ్య 75 ఏళ్ల అనుబంధానికి గుర్తుగా ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. 30 ఏళ్ల కడోవాకి ఫ్లెమింగ్ 55 టీ20 మ్యాచుల్లో ఆడాడు. అతను 139 స్ట్రయిక్ రేట్‌తో 1871 రన్స్ చేశాడు. అతని ఖాతాలో రెండు సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19వ తేదీ నుంచే మొదలు కానున్నా, క్రికెట్ ఈవెంట్ మాత్రం 24వ తేదీ నుంచి ప్రారంభంకానున్నది. జపాన్ జట్టులో వికెట్ కీపర్ వటారు మియావుచి, లెగ్ స్పిన్నర్ మకోటో తనియామా ఉన్నారు. సెప్టెంబర్ 19, 20 తేదీల్లో హాంగ్‌కాంగ్‌తో జపాన్ రెండు మ్యాచ్‌లు ఆడనున్నది. ఇక ఆసియా గేమ్స్‌లో 24న ఆఫ్ఘనిస్తాన్‌తో, 26న నేపాల్‌తో జపాన్ తలపడుతుంది.
జపాన్ జట్టు : కెండిల్ కడోవాకి ఫ్లెమింగ్, చార్లీ హరా హింజే, బెంజమిన్ ఇటో డేవిస్, అలెస్టర్ కడోవాకి, కోహియే కుబోటా, కేజ్ కుసుడా , వారు మియోచి, రియో సకురానో థామస్, అలెక్స్ షిరాయి పట్మోర్, షోమా సుగయా స్లేటర్, డెక్లన్ సుజుకి మెక్‌కాంబ్, సుయోచి తకడా, ఇబ్రహీం తకహషి, మకోటో తనియామా, లాచ్లన్ యమమాటో .
A historic one-off T20I awaits Japan as they name a 15-member squad to take on India 💪
Read more 👉 https://t.co/MMEoQLduMy pic.twitter.com/cZLtsniKnb
— ICC (@ICC) September 8, 2026