న్యూయార్క్: యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను జాన్నిక్ సిన్నర్ గెలిచాడు. ఫైనల్లో అతను టేలర్ ఫ్రిట్జ్‌పై 6-3, 6-4,7-5 స్కోరు తేడాతో విజయం సాధించాడు. నెంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ సిన్నర్.. తన బేస్‌లైన్ గేమ్‌తో ఆకట్టుకున్నాడు. ఇటీవల డ్రగ్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లు సిన్నర్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల ఇటలీ ప్లేయర్ సిన్నర్.. తన కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ సాధించాడు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా గెలిచాడతను. యూఎస్ ఓపెన్‌లో అమెరికా టెన్నిస్ ప్లేయర్ టైటిల్ గెలిచే అవకాశాన్ని సిన్నర్ అడ్డుకున్నాడు. 21 ఏళ్లుగా యూఎస్ ఓపెన్‌లో అమెరికా ప్లేయర్‌కు టైటిల్ దక్కలేదు.
డోపింగ్ వివాదం..
యూఎస్ ఓపెన్ టోర్నీకి ఆరు రోజుల ముందు మాత్రమే సిన్నర్‌కు డోపింగ్ పరీక్ష నుంచి క్లియరెన్స్ దక్కింది. రెండు సార్లు జరిపిన పరీక్షల్లో అతనికి స్వల్ప స్థాయిలో క్లోస్టెబోల్ స్టిరాయిడ్ ఉన్నట్లు తేలింది. ఫిజియోథెరపిస్ట్ అనుకోకుండా ఇవ్వడం వల్ల సిన్నర్లో స్టిరాయిడ్ ఉన్నట్లు తెలిసిందని ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ పేర్కొన్నది. యూఎస్ ఓపెన్ టైటిల్ తనకు ఎంతో ముఖ్యమైందని, ఎందుకంటే కెరీర్లో గడిచిన కొన్ని రోజులు కష్టంగా సాగినట్లు సిన్నర్ తెలిపాడు. టోర్నీ ఆడుతున్న సమయంలో డోప్ పరీక్షలకు చెందిన ఆలోచనలే వచ్చేవన్నారు.
డోపింగ్ వివాదం తర్వాత ఫిజియో, ఫిట్నెస్ ట్రైనర్ నుంచి సిన్నర్ దూరం అయ్యాడు. ఆ ఇద్దర్నీ వదులుకున్నాడు. టెన్నిస్ క్రీడల్లో బిగ్ ఫోర్‌గా పిలిచే రోజర్ ఫెదరర్, రఫేల్ నాదల్, జోకోవిడ్, ముర్రే లేకుండానే ఈ ఏడాది యూఎస్ ఓపెన్ ముగిసింది. 2002 తర్వాత ఈ నలుగురు లేకుండా గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలవడం ఇదే మొదటిసారి. అయితే ఈ ఏడాది సిన్నర్, అల్కరాజ్‌లు చెరో రెండు గ్రాండ్‌స్లామ్‌లు సొంతం చేసుకున్నారు.
Andre Agassi presents Jannik Sinner with his first US Open trophy! 🏆 pic.twitter.com/YGpyScXcbq
— US Open Tennis (@usopen) September 8, 2024