Jannik Sinner – Laila : పురుషుల టెన్నిస్ స్టార్ జన్నిక్ సినర్ (Jannik Sinner) మరో టైటిల్ సాధించాడు. ఏటీపీ ఫైనల్స్‌లో తనకు తగ్గపోటీదారుడైన కార్లోస్ అల్కరాస్ (Carlose Alcaraz)ను చిత్తు చేసి ట్రోఫీని ఒడిసిపట్టాడీ ఇటలీ కెరటం. ఫైనల్లో విజయం తర్వాత ఆ అపూర్వ క్షణాలను ప్రత్యేకంగా మలచుకున్నాడు సినర్. తన ప్రేయసి లైలా హసనోవిక్ (Laila Hasanovic)తో గెలుపు సంబురాలు చేసుకున్నాడీ విజేత. ఏటీపీ ఫైనల్లో గెలుపొందిన తర్వాత ఆమెను హత్తుకొని విజయాన్ని ఆస్వాదించాడీ టెన్నిస్ సంచలనం. దాంతో.. ఈ అందగత్తె ఎవరు? ఆని అభిమానులు నెట్టింట వెతుకున్నారు.
టెన్నిస్‌లో ఇటలీ గర్వించదగ్గ విజయాలతో అదరగొడుతున్న జన్నిక్ సినర్ ఏటీపీ ట్రోఫీ నిలబెట్టుకున్నాడు. దిగ్గజ క్రీడాకారుడిగా ఎదుగుతున్న ఈ యంగ్‌స్టర్ ఫైనల్లో కార్లోస్ అల్కరాస్‌ను వరుస సెట్లలో (7-6, 7-5)తో ఓడించి విజేతగా నిలిచాడు. ట్రోఫీతో పాటు రూ.400 కోట్ల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. అనంతరం భావోద్వేగానికి లోనైన అతడు గర్ల్‌ఫ్రెండ్ లైలా హసనోవిక్‌తో కలిసి సంబురాలు చేసుకున్నాడు. ఆమెను హగ్ చేసుకొని ‘నేను ట్రోఫీ సాధించాను’ అని మురిసిపోయాడు.
Jannik Sinner presentó públicamente a su novia Laila Hasanovic durante las ATP Finals de Turín, donde ella estuvo presente en su box acompañándolo en el torneo. pic.twitter.com/4SIScCt4h6
— ÚLTIMA HORA ECUADOR (@UltimaHoraEC_) November 17, 2025
ఈమధ్యే తాము రిలేషన్షిప్లో ఉన్నామని సినర్ బాహాటంగా ప్రకటించాడు. వియన్నా ఓపెన్(Vienna Open) టోర్నీలో విజయం తర్వాత మాట్లాడుతూ లైలా హసనోవిక్కు ధన్యవాదాలు తెలిపాడు. ఇప్పుడు ఏటీపీ ఫైనల్ తర్వాత వీరిద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడంతో ఔను వీరు ప్రేమలో ఉన్నారనే విషయం ప్రపంచమంతా తెలిసిపోయింది.
JANNIK SINNER YOU ARE UNREAL.
🤯🤯🤯🤯🤯🤯
— The Tennis Letter (@TheTennisLetter) November 16, 2025
టెన్నిస్ సంచలనం సినర్ మనసు గెలిచిన లైలా హసనోవిక్ కోపెన్‌హగన్‌లో జన్మించింది. బోస్నియాకు చెందిన దంపతులకు 2000 సంవత్సరం నవంబర్ 8న పుట్టిన తను స్వెన్బోర్గ్లో పెరిగింది. అమెరికాలోని కెంటకీలో చదివిన లైలా ప్రస్తుతం మోడల్‌గా, ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తోంది. చినప్పటి నుంచి ఫ్యాషన్ రంగం మీద ఆసక్తితో 16 ఏళ్లకే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. అందంతో పాటు తెలివితేటలున్న ఆమె 2019లో ‘మిస్ డెన్మార్క్’ ఫైనల్ వరకూ వెళ్లింది. ఆ ఈవెంట్‌తో అందాల సుందరిగా ప్రశంసలు అందుకున్న తను పలు సౌందర్య ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ఇంకేముంది.. యువత మనసు కొల్లగొట్టిన ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో 3.5లక్షల మంది ఫాలో అవుతున్నారు.
❤️ Mick Schumacher & Laila Hasanovic pic.twitter.com/jXhW3T674o
— Motorsport Türkiye (@motorsportcomtr) January 20, 2024
సినర్‌తో రిలేషన్‌షిప్‌తో ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న లైలా.. అతడికంటే ముందు మరొకరితో డేటింగ్ చేసింది. ఫార్ములా వన్ మాజీ రేసర్ మైఖేల్ షుమేకర్ కుమారుడు మిక్ షుమేకర్ (Mick Schumacher)తో ప్రేమలో ఉంది. కొన్నాళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరూ డాన్స్ వీడియోలతో వైరలయ్యారు. కానీ, ఏమైందో తెలియదు తమ బంధాన్ని త్వరగానే ముగించారు. ఆ తర్వాత సినర్‌ను ఇష్టపడిన లైలా అతడికి బలమైన మద్దతుదారుగా మారింది. అతడు ఆడే టోర్నమెంట్లలో తళుక్కుమంటూ.. చప్పట్లుకొడుతూ అతడిని ప్రోత్సహిస్తుంటుంది. టురిన్లో ముగిసిన ఏటీపీ ఫైనల్లోనూ లైలా పెంపుడు కుక్కతో కనిపించి.. మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
A 2️⃣0️⃣2️⃣5️⃣ to remember 🤩🎊
Jannik Sinner reached 10 finals in just 12 events this season. From those finals, he won six titles 🏆🤯 pic.twitter.com/0kJr7wtj2V
— TNT Sports (@tntsports) November 16, 2025