లండన్: ప్రపంచ నంబర్‌వన్, ఇటలీ టెన్నిస్ స్టార్ జానిక్ సిన్నర్‌పై మూడు నెలల నిషేధం పడింది. నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్న కారణంగా అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా) సిన్నర్‌పై మూడు నెలల పాటు నిషేధం విధిస్తూ శనివారం నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి ఏడాది పాటు నిషేధం విధించాల్సి ఉన్నా ..తాను ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదన్న సిన్నర్ వాడా నిర్ణయాన్ని ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ(ఐటీఐఏ)లో సవాల్ చేశాడు. దీంతో సిన్నర్ వాదనతో ఏకభవించిన ఐటీఐఏ..అతనిపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ క్రమంలో ఐటీఐఏ నిర్ణయాన్ని సవాలు చేస్తూ స్విట్జర్లాండ్‌లోని కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌లో సవాలు చేసిన వాడా పిటీషన్ వాపస్ తీసుకుంది. ఇందులో భాగంగా మూడు నెలల పాటు సస్పెన్షన్‌కు సిన్నర్‌కు అంగీకారం తెలపడంతో వాడా ఈ నిర్ణయానికి వచ్చింది.