IND vs AUS : భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(71) ఔటయ్యాడు. ఆడం జంపా వేసిన 22వ ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో, 142 పరుగుల వద్ద ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(69) ఆడుతున్నాడు. 22 ఓవర్లకు టీమిండియా స్కోర్.. 143/1. భారత్ విజయానికి ఇంకా 134 పరుగులు కావాలి.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 276 పరుగులకు ఆలౌటయ్యింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(52), జోష్ ఇంగ్లిస్(45), స్టీవ్ స్మిత్(41) మాత్రమే రాణించారు. పేసర్ షమీ దెబ్బకు ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్ భారీ స్కోర్ చేయలేకపోయింది.
తొలి స్పెల్‌లో ఓపెనర్ మిచెల్ మార్ష్(4), స్టీవ్ స్మిత్(41)లను ఔట్ చేసిన షమీ ఆసీస్ టాపార్డర్‌ను కూల్చాడు. ఆ తర్వాత రెండో స్పెల్‌లో మిడిల్ ఆర్డర్ పని పట్టాడు. డేంజరస్ ఆటగాళ్లు మార్కస్ స్టోయినిస్(29), మాథ్యూ షార్ట్(2)తో పాటు బౌలర్ సియాన్ అబాట్(2)లను పెవిలియన్ పంపి షమీ 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అతడు ఐదు వికెట్లు తీయడం ఇది రెండోసారి.