IND vs NZ : వడోదర వన్డేలో భారత స్టార్ ఆటగాడు వచ్చీ రాగానే విరాట్ కోహ్లీ(8 నాటౌట్) బౌండరీలతో చెలరేగుతున్నాడు. శుభారంభమిచ్చిన ఓపెనర్ రోహిత్ వర్మ(26) వికెట్ పడ్డాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. ఫోర్‌తో ఖాతా తెరిచాడు. కైలీ జేమీసన్ బౌలింగ్‌లో స్ట్రెయిట్ బౌండరీ బాదిన విరాట్.. ఫౌల్స్ ఓవర్లో రెండు ఫోర్లతో తన ఉద్దేశాన్ని చాటాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (11 నాటౌట్) కుదురుకున్నట్టే కనిపిస్తున్నాడు. 10 ఓవర్లకు స్కోర్.. 48-1.
న్యూజిలాండ్‌ను 300లకే కట్టడి చేసిన భారత్ ఛేదనలో తొలి వికెట్ కోల్పోయింది. డేంజరస్ ఓపెనర్ ఓపెనర్ రోహిత్ శర్మ(26)ను కైలీ జేమసన్ వెనక్కి పంపాడు. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో అలరించిన హిట్‌మ్యాన్ పవర్ ప్లేలోనే ఔటయ్యాడు. ఫామ్‌లేమితో బాధపడుతున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్(11 నాటౌట్) ఆచితూచి ఆడుతుండగా.. దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు సెంచరీలతో మెరిసిన విరాట్ కోహ్లీ(8 నాటౌట్) ఫోర్ల మీద ఫోర్లు కొడుతున్నాడు.
A solid start to the chase 🙌#TeamIndia 52/1 after 11 overs
Updates ▶️ https://t.co/OcIPHEpvjr#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/0yVquqwqhP
— BCCI (@BCCI) January 11, 2026
వడోదరలో కివీస్ ఓపెనర్లు హెన్రీ నికోల్స్(62), డెవాన్ కాన్వే(56)లు అర్ధ శతకాలతో శుభారంభవ్వగా.. ప్రత్యర్థి మూడొందలకు పైగా కొడుతుందనిపించింది. కానీ, ను ఔట్ హర్షిత్ రానా(2-65).. ప్రసిధ్ కృష్ణ(2-60) పొదుపుగా వికెట్ల వేటతో మిడిలార్డర్ తోకముడిచింది. ఓవైపు వికెట్లు పడుతున్న డారిల్ మిచెల్ (84) ఒంటరి సైనికుడిలా పోరాడాడు. హాఫ్ సెంచరీ తర్వాత గేర్ మార్చిన అతడిని ప్రసిధ్ వెనక్కి పంపడంతో న్యూజిలాండ్ 300లకే పరిమితమైంది.