INDA vs USA : పొట్టి ప్రపంచకప్ వామప్ మ్యాచ్‌లో భారత ఏ జట్టు ఆటగాడు నారాయన్ జగదీశన్(104) రెచ్చిపోయాడు. యూఎస్ఏ బౌలర్లను బెంబేలెత్తిస్తూ బౌండరీలతో విరుచుకుపడిన అతడు 49 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. కెప్టెన్ ఆయుష్ బదొని(60 నాటౌట్) అర్ధ శతకంతో వీరవిహారం చేయడంతో ఇండియా ఏ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికే 238 పరుగులు చేసింది.
నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత ఏ జట్టు భారీ స్కోర్‌తో యూఎస్ఏకు సవాల్ విసిరింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అమెరికా జట్టుకు జస్దీప్ సింగ్ ఆదిలోనే బ్రేకిస్తూ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(28)ను వెనక్కి పంపాడు. నాలుగో ఓవర్లోనే తొలి వికెట్ పడినా.. నారాయన్ జగదీశన్(104 : 55 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు) బౌలర్లకు చుక్కలు చూపించాడు. విధ్వంసక ఆటతో చెలరేగిన అతడు 26 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. అదే ఊపులో ప్రత్యర్థి బౌలర్లను ఉతికేస్తూ ఎడాపెడా బౌండరీలు బాదిన జగదీశన్ మరో 23 బంతుల్లోనే సెంచరీ కొట్టడం విశేషం.
🚨 EVEN NON-SELECTED PLAYER HAS SCORED CENTURY FOR INDIA 🚨
– Narayan Jagadeesan just scored 49 ball 100* vs USA in the Warm-match of T20 World Cup 2026 🔥
– He smashed 11 Fours and 4 Sixes with a massive strike rate of 202 👏🏼 pic.twitter.com/AjuZGXjXaj
— Richard Kettleborough (@RichKettle07) February 2, 2026
సర్జరీ నుంచి కోలుకుని ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేసిన తిలక్ వర్మ(38) విఫలమైనా.. ఆయుష్ బదొని(60 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. జగదీశన్‌తో కలిసి అర్ధ శతకం భాగస్వామ్యంతో జట్టు స్కోర్ 230 దాటించాడు. వీరిద్దరి మెరుపులతో ప్రత్యర్థికి 239 పరుగుల కష్టమైన లక్ష్యాన్ని ఇండియా ఏ నిర్దేశించింది.