సిడ్నీ: యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో విజయం కోసం ఇరుజట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉన్న పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కూడా ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుని ఒకదశలో మెరుగ్గానే నిలిచినా కీలక సమయంలో వికెట్లు కోల్పోయి తడబడింది. యువ బ్యాటర్ జాకబ్ బెతెల్ (232 బంతుల్లో 142 నాటౌట్; 15 ఫోర్లు) అజేయ శతకంతో ఆ జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.
బెతెల్‌కు బ్రూక్ (42), డకెట్ (42) కొద్దిసేపు అండగా నిలబడ్డా వాళ్లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు. 183 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఇంగ్లండ్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 302/8తో నిలిచి 119 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని దక్కించుకుంది.