టోక్యో: ఒలింపిక్స్లో 100 మీటర్ల పరుగుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పట్టుమని 10 సెకన్లలో ముగిసే ఈ రేసును చూడటానికి ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అందులోనూ గత మూడు ఒలింపిక్స్లో 100 మీటర్ల రేసు అంటే బోల్ట్దే గోల్డ్ మెడల్ అని ఫిక్సయిపోయి చూసేవారు. కానీ ఈసారి అతడు లేకుండా జరిగిన ఈ రేసులో ఓ కొత్త చాంపియన్ అవతరించాడు. ఇటలీకి చెందిన లామంట్ మార్సెల్ జాకబ్స్ 9.8 సెకన్లలో రేసు పూర్తి చేసి ఒలింపిక్ చాంపియన్గా నిలిచాడు. ఇది యురోపియన్ రికార్డు కావడం విశేషం. ఇక అమెరికాకు చెందిన ఫ్రెడ్ కెర్లీ 9.84 సెకన్లతో రెండోస్థానంలో, కెనడాకు చెందిన ఆండ్రీ డి గ్రాస్ 9.89 సెకన్లలో మూడోస్థానంలో నిలిచారు. ఈ రేసులో పాల్గొన్న అథ్లెట్లను నిర్వాహకులు అథ్లెటిక్ స్టేడియంలో వినూత్నంగా చూపించారు. లైట్లన్నీ ఆఫ్ చేసి 12 ప్రొజెక్టర్లతో ఈ అథ్లెట్ల 3డీ ఇమేజ్లను ప్రదర్శించారు.