యూరో 2020 ఫుట్‌బాల్ కప్ విజేతగా ఇటలీ నిలిచింది. 55 ఏళ్ల తర్వాత తొలిసారి ఫైనల్‌కు చేరిన ఇంగ్లాండ్.. వరుస విజయాలతో జోరుమీదున్నప్పటికీ.. ఇటలీతో తుదిపోరులో ఓడిపోయింది. మొట్టమొదటి యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను అందుకోవాలనే పట్టుదలతో ఇంగ్లిష్ జట్టు పోరాడినప్పటికీ.. ఈ టోర్నీలో రెండోసారి విజయదుందుభి మోగించింది ఇటలీ జట్టు. తొలిసారి 1968లో యూరో కప్‌లో విజేతగా ఇటలీ నిలించింది.
పెనాల్టీ షూటౌట్లో 3-2 తేడాతో ఇంగ్లండ్‌పై ఇటలీ విజయం సాధించింది. యూరో కప్ ఫైనల్స్‌లో ఇంగ్లండ్ ఆటగాడు లూక్ షా స్టెక్ అతివేగంగా గోల్ చేశాడు. ఆట ప్రారంభమైన 2వ నిమిషంలోనే లూక్ గోల్ చేశాడు. 67వ నిమిషంలో ఇటలీ గోల్ చేసి.. 1-1గా సమం చేసింది. 90 నిమిషాల ఆట వ్యవధిలో ఇటలీ, ఇంగ్లండ్ జట్లు 1-1 స్కోర్ చేశాయి. పెనాల్టీ షూటౌట్లో ఇటలీ 3 గోల్స్ చేసి విజేతగా నిలిచింది.
2000, 2012లో ఇటలీ జట్టు ఫైనల్ చేరినా.. ఫైనల్ పోరులో నెగ్గలేకపోయింది. 2018 ప్రపంచకప్‌కు ఇటలీ అర్హత సాధించడంలో విఫలమైంది. ఇక ఆ కసితో తరువాత ఆడిన మ్యాచుల్లో అపజయమే లేకుండా దూసుకెళ్లింది. 33 మ్యాచ్‌ల్లో ఇటలీ వరుసగా గెలుస్తూ వచ్చింది. ప్రధాన టోర్నీల్లో ఇంగ్లండ్ పై ఇటలీదే పైచేయిగా నిలిచింది. ఒక్క మ్యాచులోనూ ఓడిపోకుండా ఇంగ్లండ్‌పై ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది. మొత్తంగా ఫైనల్ మ్యాచులోనూ విజయం సాధించి, రెండవ సారి యూరోకప్ను ముద్దాడింది. ఇంగ్లండ్, ఇటలీ జట్లు 27 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇటలీ 11, ఇంగ్లాండ్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.
TUTTO VERO 🇮🇹✌️#EURO2020 pic.twitter.com/rQTN37fooZ
— Roberto Mancini (@robymancio) July 11, 2021
🇮🇹🏆🤗 #EURO2020 | #ITA pic.twitter.com/vfeIuZHsMo
— UEFA EURO 2024 (@EURO2024) July 12, 2021
Complimenti Itália 👏👏🇮🇹🏆 @azzurri https://t.co/gmRug6PjYt
— Nuno Gomes (@21nunogomes) July 12, 2021