రోమ్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సన్నాహకమైన ఇటాలియన్ ఓపెన్‌లో అమెరికా టెన్నిస్ స్టార్ కొకో గాఫ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో గాఫ్ 6-4, 7-6(5)తో మిర్రా అండ్రీవాపై అలవోక విజయం సాధించింది.
అండ్రీవాపై తన వరుస విజయాల పరంపరను కొనసాగిస్తూ గాఫ్ మూడోసారి సెమీస్‌లోకి ప్రవేశించింది. మరో సెమీస్‌లో జాస్మిన్ పౌలోని, పీటన్ స్టెర్న్స్ తలపడనున్నారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో కార్లోస్ అల్కరాజ్ 6-4, 6-4తో జాక్ డ్రేపర్‌పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించాడు.