Jannik Sinner | ఫ్లోరిడా: మియామి ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేతగా ఇటలీ కుర్రాడు జన్నిక్ సిన్నర్ నిలిచాడు. ఫ్లోరిడా వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన ఫైనల్లో మూడో సీడ్ సిన్నర్.. 6-3, 6-1 తేడాతో బల్గేరియా ఆటగాడు, 11వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్‌ను చిత్తుచేశాడు. కార్లొస్ అల్కరజ్, డానియల్ మెద్వెదెవ్ వంటి స్టార్ ప్లేయర్లకు షాకిచ్చిన దిమిత్రోవ్.. ఫైనల్ పోరులో మాత్రం తేలిపోయాడు.
గంటా 13 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వరుస సెట్లను గెలుచుకున్న సిన్నర్ మియామి ఓపెన్ గెలిచిన తొలి ఇటలీ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 2021, 2023లలో ఫైనల్ చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకున్న సిన్నర్.. మూడో ప్రయత్నంలో టైటిల్ నెగ్గడం విశేషం. ఈ ఏడాది ఆరంభ సీజన్ ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన సిన్నర్.. ఏటీపీ రోటర్డామ్లోనూ టైటిల్ కొట్టాడు. ఇండియానా వెల్స్‌లో అల్కరజ్ చేతిలో ఓడినా మియామి ఓపెన్‌లో విజేతగా నిలిచాడు.