మస్కట్: ప్రపంచకప్ గెలిస్తేనే గొప్ప ఆటగాళ్లుగా, ప్రపంచకప్ గెలువనంత చెడ్డ ఆటగాళ్లుగా జమకట్టలేమని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఒమన్‌లో ఉన్న ఆయన ఓ జాతీయ మీడియా సంస్థతో కాసేపు ముచ్చటించారు. దేశానికి చెందిన గొప్పగొప్ప క్రికెటర్లు ప్రపంచకప్ గెలువాలన్న తమ కల నెరవేరకుండానే రిటైర్ అయ్యారని ఆయన గుర్తుచేశారు.
భారత దిగ్గజ క్రికెటర్ ఆరు వరల్డ్ కప్‌లు ఆడితే కేవలం ఒక్క వరల్డ్‌కప్‌లో విజయం దక్కిందని రవిశాస్త్రి చెప్పారు. గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్ లాంటి ఎంతోమంది గొప్ప ఆటగాళ్లకు వరల్డ్‌కప్ గెలువాలన్న కల నెరవేరలేదని, అంతమాత్రాన వాళ్లను చెత్త ప్లేయర్లుగా అంచనా వేయలేమని ఆయన పేర్కొన్నారు. ఒక ఆటగాడు తన కెరియర్లో ఎంత గొప్ప ప్రదర్శన ఇచ్చాడన్న దానిపై అతని గొప్పతనం ఆధారపడి ఉంటుందన్నారు.
తాను దాదాపు ఏడేండ్లు టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేశానని, ఎవరు ఎలా ఆడుతారో నాకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. అయినా, తన ఆటగాళ్ల గురించి తాను పబ్లిక్ చర్చించదలుచుకోలేని రవిశాస్త్రి చెప్పారు.