ముంబై: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్(ఐఎమ్ఎల్) రెండో సీజన్‌కు వేళయైంది. ఈ ఏడాది అక్టోబర్ 24 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు లీగ్ జరుగనుంది. తమ అద్భుత ఆటతీరుతో కోట్లాది మంది అభిమానులను అలరించిన దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, షేన్ వాట్సన్, యువరాజ్‌సింగ్, క్రిస్ గేల్, కుమార సంగక్కర మరోమారు ఒకే వేదికపైకి రాబోతున్నారు. ముంబై, వడోదరా, వైజాగ్ వేదికలుగా ఐఎమ్ఎల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
సీజన్-1కు ఏమాత్రం తీసిపోకుండా ఈసారి ప్రపంచస్థాయి టీ20 యాక్షన్ థ్రిల్లర్ ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 266మిలియన్లతో దేశంలో అత్యధికంగా వీక్షించిన రెండో లీగ్‌గా ఐఎమ్ఎల్ అరంగేట్రం సీజన్ నిలిచిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. సచిన్ సారథ్యంలోని ఇండియన్ మాస్టర్స్..గత సీజన్లో లీగ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.