నింగ్బో: భారత షూటర్ ఇషా సింగ్( Esha Singh) అద్భుత ప్రదర్శన ఇచ్చింది. చైనాలోని నింగ్బోలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్లో .. షూటర్ ఇషా సింగ్ గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నది. నింగ్బో ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్లో జరిగిన ఈవెంట్లో.. హోం ఫెవరేట్ యావో క్వియాన్జున్ను మట్టికరిపించిందామె. ఫైనల్ ఉత్కంఠభరితంగా జరిగింది. దక్షణి కొరియాకు చెందిన క్రీడాకారిణి ఓహ్ యెజిన్ బ్రాంచ్ మెడల్ గెలుచుకున్నది. ఇషా సింగ్ 242.6 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నది. గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉన్నట్లు ఇషా సింగ్ పేర్కొన్నది.