లాహోర్: పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) 10వ సీజన్ తేదీలు ఖరారయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ క్వాలాండర్స్ జట్ల మధ్య ఏప్రిల్ 11వ తేదీన పోరుతో లీగ్‌కు తెరలేవనుంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం మొత్తం 13 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. ఇందులో రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లతో పాటు మే 18న ఫైనల్ మ్యాచ్ ఉంది.
మరోవైపు రావల్పిండి స్టేడియంలో 11 మ్యాచ్‌లు, కరాచీలో 5 మ్యాచ్‌లు జరుగనున్నాయి. పీఎస్ఎల్ ద్వారా ప్రతిభ కల్గిన ప్లేయర్లు వెలుగులోకి వస్తున్నారని లీగ్ సీఈవో సల్మాన్ నసీర్ పేర్కొన్నాడు. వచ్చే సీజన్ నుంచి ప్రస్తుతమున్న ఆరు జట్లకు తోడు మరో రెండు జట్లు కలుస్తాయని ఆయన తెలిపాడు.