అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియంలో మరికాసేపట్లో రసవత్తర పోరు ఆరంభంకానుంది. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. బెంగళూరుపై టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఢిల్లీ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సీజన్ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మను తీసుకున్నట్లు పంత్ పేర్కొన్నాడు. డేన్ క్రిస్టియన్ స్థానంలో డేనియల్ సామ్స్, సైనీ స్థానంలో రజత్ పటిదార్ తుదిజట్టులోకి వచ్చినట్లు ఆర్సీబీ సారథి విరాట్ వెల్లడించాడు.
Match 22. Delhi Capitals XI: P Shaw, S Dhawan, S Smith, R Pant, M Stoinis, S Hetmyer, A Patel, K Rabada, A Mishra, I Sharma, A Khan https://t.co/DMSHuJdGhN #DCvRCB #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 27, 2021
Match 22. Royal Challengers Bangalore XI: V Kohli, D Padikkal, G Maxwell, AB de Villiers, W Sundar, R Patidar, D Sams, K Jamieson, H Patel, M Siraj, Y Chahal https://t.co/DMSHuJdGhN #DCvRCB #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 27, 2021