Ishan Kishan : దేశవాళీలో విధ్వంసక ఆటతో సెలెక్టర్లకు సవాల్ విసిరిన ఇషాన్ కిషన్(Ishan Kishan) మళ్లీ నీలిరంగు జెర్సీ వేసుకోనున్నాడు. ఇటీవలే ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లో జార్ఖండ్‌ను తొలిసారి ఛాంపియన్‌గా నిలిపిన ఇషాన్ అనుకున్నట్టే ప్రపంచకప్ బెర్తు దక్కించుకున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో జరుగబోయే టీ20 ప్రపంచకప్ (T20 World Cup) స్క్వాడ్‌కు తనను ఎంపిక చేయడంపై ఇషాన్ స్పందించాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ శనివారం ఏఎన్ఐతో మాట్లాడుతూ తనకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. భగవద్గీత (Bhagavad Gita) చదవడం ద్వారా ఒత్తిడి, కష్టాలను అధిగమించానని చెప్పాడీ హిట్టర్.
న్యూజిలాండ్‌తో ఐదు టీ20 సిరీస్‌తో పాటు ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన 15మంది స్క్వాడ్‌లో ఇషాన్‌కు చోటు లభించింది. శవాళీలో మెరుపు ఇన్నింగ్స్‌లతో అవకాశం దక్కించుకున్నాడు. దాంతో.. రెండేళ్ల క్రితం చివరి టీ20 ఆడిన ఇషాన్ కిషన్‌ను మళ్లీ బ్లూ జెర్సీలో చూసే రోజులొచ్చేశాయి. టాపార్డర్‌లో రెండో వికెట్ కీపర్ ఉండాలనే ఉద్దేశంతోనే ఇషాన్‌కు చోటిచ్చామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. దాంతో.. ఈ చిచ్చరపిడుగుకు ప్రపంచకప్ స్క్వాడ్‌లోకి వచ్చాడు. ఈ సందర్భంగా ఎన్ఐఏ భారత స్టార్‌ను పలకరించింది. చాలా సంతోషంగా ఉంది. దేశవాళీలో నా టీమ్ జార్ఘండ్ తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలుపొందడం పట్ల కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రతిఒక్కరూ చాలా బాగా ఆడారు అని ఇషాన్ తెలిపాడు.
Powered by belief to do something special in the final ✨
Fueled by “Watch the ball, hit the ball” mantra 🎯
Instilling fearless attitude in the team 🔥
Ishan Kishan relives his & Jharkhand’s heroics in historic #SMAT 🏆 – By @jigsactin@IDFCFIRSTBank pic.twitter.com/VTMbBqnsYd
— BCCI Domestic (@BCCIdomestic) December 20, 2025
నిరుడు దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశం వచ్చిన ఇషాన్ గడ్డుకాలం ఎదుర్కొన్నాడు. బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేయడంతో సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన అతడి కెరీర్ ముగిసిందనుకున్నారంతా. కానీ, ఈ యంగ్‌స్టర్ గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చాడు. ఒత్తిడిని దరి చేరనివ్వకుండా.. ప్రశాంతంగా కనిపించిన ఇషాన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెలరేగిపోయాడు. దీనికంతటికి కారణం భగవద్గీతనే అంటున్నాడీ స్టార్ ప్లేయర్. ‘నేను మానసికంగా ఒత్తిడికి లోనైన విషయం తెలిసి మా నాన్న భగవద్గీత చదవమని చెప్పాడు. అప్పటి నుంచి పాకెట్ సైజ్ భగవద్గీత పుస్తకాన్ని క్రికెట్ కిట్ బ్యాగులో తీసుకెళ్లేవాడిని.
Ishan Kishan speaks on reading the Bhagavad Gita.🙏🏻 pic.twitter.com/VD1xTiQwQf
— RVCJ Media (@RVCJ_FB) December 19, 2025
బాధగా ఉన్నప్పుడు, కష్ట సమయాలు ఎదురైనప్పుడు ఆ పుస్తకంలోని వాక్యాలు చదివితే మనసు తేలికయ్యేది. ఒత్తిడి తగ్గపోయి మనసు ప్రశాంతంగా మారేది. అన్ని విషయాలపై నాకు స్పష్టత ఏర్పడింది. క్రమంగా నాలో మార్పు రావడాన్ని కోచ్, జట్టు సభ్యులు గమనించారు’ అని ఇషాన్ పేర్కొన్నాడు. స్మాట్‌లో ఆటగాడిగానే కాదు సారథిగానూ నూటికి నూరుమార్కులు కొట్టేశాడు ఇషాన్. 10 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 517 పరుగులు సాధించాడీ హిట్టర్.
ISHAN KISHAN TALKS AFTER THE WORLD CUP CALL. 🔥 [ANI] pic.twitter.com/LrIGDwPCWt
— Johns. (@CricCrazyJohns) December 20, 2025
భారత స్క్వాడ్ : అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రింకూ సింగ్, బుమ్రా, హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్.