IND vs NZ : పొట్టి ప్రపంచకప్ ముందు చివరి సిరీస్‌కు భారత జట్టు సిద్ధమైంది. నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌తో తొలి టీ20లో ఐదుమ్యాచ్‌ల సిరీస్ మొదలవ్వనుంది. ఇండోర్ వన్డేలో ఓటమితో ట్రోఫీని కోల్పోయిన టీమిండియా పొట్టి ఫార్మాట్లో కివీస్‌కు షాకివ్వాలనుకుంటోంది. టాస్ గెలిచిన బ్లాక్‌క్యాప్స్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ బౌలింగ్ తీసుకున్నాడు.
ఇటీవలే దక్షిణాఫ్రికాను చిత్తు చేస్తూ సిరీస్ పట్టేసిన సూర్యకుమార్ యాదవ్ సేన న్యూజిలాండ్‌ను మట్టికరిపించాలనే పట్టుదలతో ఉంది. ఈ సిరీస్‌తో ప్రపంచకప్ కోసం పక్కాగా ప్లాన్ చేసుకోనంది భారత్. అయితే.. తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ గాయంతో ఈ సీరీస్‌కు దూరమయ్యారు. వీరి స్థానంలో శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ స్క్వాడ్‌లోకి రాగా.. ఇషాన్ తుది జట్టులోకి వచ్చాడు.
Presenting #TeamIndia‘s Playing XI for the 1⃣st T20I 🙌
Updates ▶️ https://t.co/ItzV352OVv#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/t1BZ6pNUS0
— BCCI (@BCCI) January 21, 2026
భారత తుది జట్టు : సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్ తుది జట్టు : టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే(వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), క్రిస్టియన్ క్లార్కే, కైలీ జేమీసన్, ఇష్ సోధీ, జాకబ్ డఫ్ఫీ.
🚨 Toss 🚨#TeamIndia have been asked to bat first in Nagpur.
Updates ▶️ https://t.co/ItzV352OVv#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/7iRUCUyYeQ
— BCCI (@BCCI) January 21, 2026
స్వదేశంలో ఫిబ్రవరి 7 నుంచి మొదలయ్యే టీ20 ప్రపంచకప్కోసం కాచుకొని ఉన్న టీమిండియాకు న్యూజిలాండ్ సవాల్ విసురుతోంది. వన్డేల్లో సంచలన ఆటతో సిరీస్ విజేతగా నిలిచిన బ్లాక్‌క్యాప్స్.. ఈసారి టీ20ల్లోనూ పంజా విసరాలని అనుకుంటోంది.