Ishan Kishan : భారత జట్టు యువ ఓపెనర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) దేశవాళీ లీగ్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ పర్యటనకు సిద్ధమవుతున్న అతను దులీప్ ట్రోఫీ(Duleep Trophy) నుంచి తప్పుకున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) బెంచ్‌కే పరిమితమైన అతను విండీస్ గడ్డపై పరుగుల వరద పారించేందుకు తహతహలాడుతున్నాడు.
అందుకని నేషనల్ క్రికెట్ అకాడమీ(National Cricket Academy)లో టెక్నిక్ మెరుగుపర్చుకోవాలని అనుకుంటున్నాడు. అవును.. ఈ లెఫ్ట్ హ్యాండర్ వచ్చే వారం బెంగళూరూలోని ఎన్సీఏకు వెళ్లనున్నాడు. మరికొంత మంది భారత క్రికెటర్లు కూడా ఇషాన్‌ను అనుసరించనున్నారని టాక్.
వెస్టిండీస్ పర్యటన(Westindies Tour)లో టీమిండియా రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. మొదటి టెస్టు జూలై 12 – 16 తేదీల్లో విండ్సర్ పార్క్ స్టేడియంలో, రెండో టెస్టు 20-24 మధ్య క్వీన్స్ పార్ట్ ఓవల్ వేదికగా జరగనున్నాయి. వన్డే సిరీస్ జూలై 27న మొదలు కానుంది. మొదటి వన్డేకు కింగ్స్టన్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. రెండో వన్డే జూలై 29న అదే స్టేడియంలో జరగనుంది. భారత్, వెస్టిండీస్ జట్లు ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో మూడో వన్డే ఆడతాయి. ఐదు టీ 20ల సిరీస్ ఆగష్టు 3న ప్రారంభమవుతుంది. ఆగష్టు 6, 8, 12, 13న మిగతా టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి.
🚨 NEWS 🚨
2️⃣ Tests
3️⃣ ODIs
5️⃣ T20Is
Here’s the schedule of India’s Tour of West Indies 🔽#TeamIndia | #WIvIND pic.twitter.com/U7qwSBzg84
— BCCI (@BCCI) June 12, 2023