Ishan Kishan | తిరునెలివెలి: గతేడాది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆగ్రహానికి గురై బోర్డు కాంట్రాక్టుతో పాటు జాతీయ జట్టులో చోటు కోల్పోయిన ఇషాన్ కిషన్ దేశవాళీ టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్లోనే శతకంతో చెలరేగాడు. తమిళనాడు వేదికగా జరుగుతున్న బుచ్చిబాబు టోర్నీలో భాగంగా జార్ఖండ్ సారథిగా బరిలోకి దిగిన ఇషాన్.. సెంచరీ (107 బంతుల్లో 114, 5 ఫోర్లు, 10 సిక్సర్లు)తో రాణించాడు.
86 బంతుల్లోనే శతకం పూర్తిచేసిన ఇషాన్ రెడ్ బాల్ క్రికెట్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. 92 పరుగుల వద్ద ఉండగా వరుస సిక్సర్లతో శతకాన్ని పూర్తిచేశాడు. ఈ టోర్నీ ముగిశాక అతడు వచ్చే నెలలో మొదలయ్యే దులీప్ ట్రోఫీలో ఆడాల్సి ఉంది.