Ishan Kishan : వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం భారత స్క్వాడ్ ఎంపిక ఆసక్తి రేపుతోంది. ప్రపంచకప్ బృందంలో ఎవరు ఉంటారు? ఎవరిపై వేటు పడనుంది? అని చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా.. ఫామ్‌లో లేని శుభ్‌మన్ గిల్ (Shubman Gill)ను తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్న వేళ నేనున్నానని భరోసానిస్తున్నాడు ఇషాన్ కిషన్ (Ishan Kishan). సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) ఫైనల్లో 45 బంతుల్లోనే సెంచరీతో గర్జించిన ఈ చిచ్చరపిడుగు.. ప్రపంచకప్ స్క్వాడ్‌కు గట్టిపోటీ ఇస్తున్నాడు. దాంతో.. గిల్‌ను పక్కన పెట్టేసి ఇషాన్‌కు అవకాశమిస్తారా? అనేది ఇప్పుడు అభిమానులందరి మొదళ్లలో తిరుగుతున్న ప్రశ్న.
ఇంగ్లండ్ పర్యటనతో టెస్టు కెప్టెన్సీ, ఆస్ట్రేలియా సిరీస్‌తో వన్డే పగ్గాలు చేపట్టిన శుభ్‌మన్ గిల్ టీ20ల్లో మాత్రం తేలిపోతున్నాడు. వరల్డ్ కప్ సన్నద్ధతలో ఒకటైన దక్షిణాఫ్రికాపై మూడు మ్యాచుల్లోనూ (4, 0, 28 పరుగులు) గిల్ దారుణంగా విఫలమయ్యాడు. సంజూ శాంసన్‌ను బెంచ్ మీద కూర్చోబెట్టి.. వరుసగా అవకాశాల్చినా సద్వినియోగం చేసుకోలేదు. దాంతో చివరి రెండు మ్యాచ్‌లకు గిల్‌ను తప్పిస్తారనే వార్తలు వినిపించాయి. అయితే.. పాదం గాయంతో గిల్ చివరి రెండుమ్యాచ్లకు దూరమయ్యాడు. వరల్డ్‌కప్ సమీపిస్తున్నందున అతడి బదులు మరొకరిని తీసుకోవడం మంచిదని మాజీలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ తన విధ్వంసక ఆటతో సెలెక్టర్లకు సవాల్ విసురుతున్నాడు.
19 saal baad – SMAT ko mila hai ek naya champion.
Undefeated. Unstoppable – Posting the highest score in the format’s history in the final – Jharkhand led by Ishan Kishan and the co have earned it! 👏
Special mention for Haryana who’ve had a fantastic season as well 🙌 pic.twitter.com/VSTGmwkeMg
— Aakash Chopra (@cricketaakash) December 18, 2025
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వీరకొట్టుడు కొట్టిన ఇషాన్.. గురువారం ఫైనల్లో రెచ్చిపోయి 45 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీలో 517 రన్స్ బాదిన ఈ లెఫ్ట్ హ్యాండర్ నేను అసలైన టీ20 క్రికెటర్ అని చాటుకున్నాడు. గిల్ విఫలమైతున్న వేళ.. ప్రపంచకప్ కోసం నా పేరును కూడా పరిశీలించాలని సెలెక్టర్లకు చెప్పకనే చెప్పాడీ కుర్ర హిట్టర్.
పొట్టి క్రికెట్లో మిస్టర్ 360గా పేరొందిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం గొప్పగా ఆడడం లేదు. సఫారీలపై మూడు మ్యాచుల్లో 12, 5, 12 పరుగులతో అందర్నీ షాక్‌కు గురి చేశాడు సూర్య. స్వదేశంలో ప్రపంచకప్ జరుగనున్నందున కీలక ఆటగాళ్లైన గిల్, సూర్య ఫామ్ అందుకోకపోవడం మేనేజ్మెంట్, అభిమానులను కలవరపరుస్తోంది.
Hello , Ajit Agarkar and Gautam Gambhir , hope u take note of this ✍️
Bring Ishan Kishan in team
— Bihar_se_hai (@Bihar_se_hai) December 18, 2025