IND vs ENG : మాంచెస్టర్‌లో భారత టాపార్డర్ దంచేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(43) శుభారంభమివ్వగా.. ఇషాన్ కిషన్(49), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(37)లు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. డెత్ ఓవర్లలో ఇంగ్లండ్ బౌలర్లు కట్టడి చేసినా.. ఆర్చర్‌ను వణికిస్తూ చివరి ఓవర్లో తిలక్ వర్మ((24 నాటౌట్) 6, 6, 4 బాదాడు. దాంతో, రెండో టీ20లో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు శుభారంభమిచ్చారు. అభిషేక్ శర్మ(43), వైభవ్ సూర్యవంశీ(14)లు దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించి తొలి వికెట్‌కు 50 రన్స్ జోడించారు. అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన వైభవ్.. జోఫ్రా ఆర్చర్ తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. అనంతరం టంగ్‌కు సిక్సర్ రుచి చూపాడు. అయితే.. విల్ జాక్స్ ఓవర్లో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌటయ్యాడు. దాంతో, అరంగేట్రం మ్యాచ్‌లో ఔటైన తొలి భారత ఆటగాడిగా మరో రికార్డు నెలకొల్పాడు.
A crucial knock in the middle 🙌
Ishan Kishan walks back after an important 4️⃣9️⃣(40) 👏
Updates ▶️ https://t.co/WYfL8tAm58 #TeamIndia | #ENGvIND pic.twitter.com/wrvD27YpJA
— BCCI (@BCCI) July 4, 2026
కాసేపటికే సామ్ కరన్ ఓవర్లో అభిషేక్ వెనుదిరిగాడు. ఓపెనర్లు విఫలమైనా ఇషాన్ కిషన్(49), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(37)లు వేగంగా ఆడారు. మూడో వికెట్‌కు 65 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని డాసన్ విడదీశాడు. శివం దూబే(5) నిరాశపరచగా.. చివరి ఓవర్లో తిలక్ వర్మ(24 నాటౌట్) 6, 6, 4 కొట్టాడు. దాంతో, భారత్ 7 వికెట్ల నష్టానికి 190 పరుగులతో ఆతిథ్య జట్టుకు సవాల్ విసిరింది.