ఇషా రజత గురి.. సురుచికి స్వర్ణం
భారత స్టార్ షూటర్, హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో డబుల్ ధమాకా మోగించింది. రెండు వరల్డ్ రికార్డులు బ్రేక్ చేస్తూ 25 మీటర పిస్టల్ విభాగంలో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించిన ఇషా తాజాగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో రజతం అందుకుంది.
మ్యూనిచ్ : భారత స్టార్ షూటర్, హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో డబుల్ ధమాకా మోగించింది. రెండు వరల్డ్ రికార్డులు బ్రేక్ చేస్తూ 25 మీటర పిస్టల్ విభాగంలో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించిన ఇషా తాజాగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో రజతం అందుకుంది. దాంతో ఈ మెగా టోర్నీలో రెండు వ్యక్తిగత పతకాలు నెగ్గిన భారత తొలి మహిళా షూటర్‌గా రికార్డుకెక్కింది. శుక్రవారం జరిగిన 10 మీటర్ల పిస్ట్ ఫైనల్లో భారత్‌కే చెందిన సురుచి ఇందర్ సింగ్ స్వర్ణ పతకం సాధించగా, ఇషా రజత పతకం గెలుచుకుంది. ఫైనల్లో సురుచి 242.1 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి వరుసగా రెండో ఏడాది స్వర్ణం గెలిచింది. ఇషా 241.2 పాయింట్లతో రజతం దక్కించుకుంది.
పురుషుల విభాగంలో భారత షూటర్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ 592 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించినప్పటికీ, పోటీ ముగిసిన తర్వాత జరిగిన తుపాకీ తనిఖీలో కొలతల లోపాల కారణంగా దురదృష్టవశాత్తూ అతను అనర్హతకు గురయ్యాడు. ఇదే ఈవెంట్లో రుద్రాంక్ష్ పాటిల్ 585 పాయింట్లతో 53వ స్థానంలో నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

