IRE vs CAN : టీ20 వరల్డ్ కప్ 13వ మ్యాచ్లో ఐర్లాండ్(Ireland), కెనడా(Canada) తలపడుతున్నాయి. భారత్ చేతిలో ఓడిన ఐరిష్ జట్టు బోణీపై కన్నేయగా.. ఆతిథ్య అమెరికాపై పరాజయం పాలైన కెనడా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది.
న్యూయార్క్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ బౌలింగ్ తీసుకున్నాడు. బంతి అనూహ్యంగా బౌన్స్ అయ్యే నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈరోజు ఎంత స్కోర్ నమోదవుతుందో చూడాలి.
కెనడా తుది జట్టు : అరోన్ జాన్సన్, నవ్నీత్ ధలివల్, పర్గాత్ సింగ్, నికోలస్ కిర్టన్, శ్రేయాస్ మొవ్వ(వికెట్ కీపర్), దిల్ప్రీత్ బజ్వా, సాద్ బిన్ జాఫర్(కెప్టెన్), డిల్లాన్ హెల్గెర్, కలీమ్ సనా, జునైద్ సిద్దిఖీ, జెరెమె గోర్డన్.
ఐర్లాండ్ తుది జట్టు : అండ్రూ బాల్బిరినే, పాల్ స్టిర్లింగ్(కెప్టెన్), లొర్కన్ టక్కెర్(వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డక్రెల్, గెరెత్ డెలానీ, మార్క్ అడైర్, బ్యారీ మెక్కార్తీ, జోషు లిటిల్, క్రెగ్ యంగ్.