అడిలైడ్: జోషువా బ్రియాన్ లిటిల్ ఇవాళ తన ఖాతాలో హ్యాట్రిక్ వేసుకున్నాడు. ఐర్లాండ్‌కు చెందిన ఎడమ చేతి స్పీడ్ బౌలర్ లిటిల్.. టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై హ్యాట్రిక్ తీశాడు. సూపర్12లో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో అతను 19వ ఓవర్లో ఆ అరుదైన ఫీట్‌ను నమోదు చేశాడు. ఈ వరల్డ్‌కప్‌లో హ్యాట్రిక్ నమోదు కావడం ఇది రెండవసారి. నాలుగు ఓవర్లు వేసిన జోషువా 22 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు.
కివీస్ బ్యాటర్లు విలియమ్సన్, నీషమ్, సాంట్నర్‌లను అతను ఔట్ చేశాడు. ఐర్లాండ్ తరపున టీ20ల్లో హ్యాట్రిక్ దక్కడం ఇది రెండోసారి. విలియమ్సన్ క్యాచ్ అవుట్ కాగా, నీషమ్, సాంట్నర్లు ఎల్బీడబ్ల్యూ ఔటయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌లో యూఏఈ స్పిన్నర్ కార్తిక్ మరియప్పన్ హ్యాట్రిక్ తీశాడు. శ్రీలంకతో జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో అతను హ్యాట్రిక్ తీశాడు. లిటిల్ తీసిన హ్యాట్రిక్ ఈ వరల్డ్‌కప్‌లో రెండవది.