హైదరాబాద్ ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ లీగ్ ‘సి’ డివిజన్ మ్యాచ్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ (76 బంతుల్లో 101; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో చెలరేగాడు. సికింద్రబాద్ క్లబ్ తరఫున బరిలోకి దిగిన ఆనంద్.. ఆదివారం సత్య క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో దంచికొట్టాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆనంద్.. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఆనంద్‌తో పాటు రాంబాబు (102) కూడా శతకం నమోదు చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన సికింద్రాబాద్ క్లబ్ భారీ స్కోరు చేసింది.