IPL 2025 | భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసింది. ధర్మశాలలో గురువారం పంజాబ్-ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్, పఠాన్‌కోఠ్‌లో పాకిస్తాన్ డ్రోన్, వైమానిక దాడుల నేపథ్యంలో బ్లాక్ అవుట్ కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత మ్యాచ్‌ను కొనసాగించలేమన్న బీసీసీఐ మ్యాచ్‌ను అర్ధాంతరంగా రద్దు చేసింది. ఫ్లడ్ లైట్ల లోపం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. ప్రేక్షకులు, ఆటగాళ్లను మైదానం బయటకు తీసుకువచ్చింది. సాంకేతిక లోపం కారణంగా మ్యాచ్ రద్దు చేసినట్లు బీసీసీఐ పేర్కొంది. ధర్మశాల నుంచి క్రికెటర్లతో పాటు సిబ్బంది, బ్రాడ్‌క్యాస్టింగ్ సిబ్బందిని తరలించేందుకు బీసీసీఐ ప్రత్యేకంగా రైలును పంపింది.
ఇదిలా ఉండగా.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం ఐపీఎల్‌ను నిర్వహించడం ఏమాత్రం మంచిది కాదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలోనే లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసినట్లు ఆ అధికారి జాతీయ మీడియాకు వివరించారు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్లో గురువారం నాటికి 58 మ్యాచులు జరిగాయి. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ – బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఫైనల్‌తో సహా మొత్తం 74 మ్యాచులు జరుగాల్సి ఉంది. ప్రస్తుతం టోర్నీ చివరి దశలో ఉన్నది. ఫైనల్‌తో సహా మొత్తం 16 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. ఫైనల్ ఫైనల్ మ్యాచ్ మే 25న కోల్‌కతాలో జరగాల్సింది. అయితే, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ గురువారం ఐపీఎల్ 18వ సీజన్ కొనసాగుతుందని తెలిపారు. అయితే, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని తాజాగా బీసీసీఐ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించింది.
IPL 2025 suspended with immediate effect, in view of India-Pakistan tension: BCCI sources pic.twitter.com/lY556tTAkc
— ANI (@ANI) May 9, 2025