IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 సీజన్లో డిపెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగబోతున్నది. గత సీజన్ వరకు శ్రేయాస్ అయ్యర్ జట్టు కెప్టెన్‌గా కొనసాగుతాడు. మెగా వేలానికి ముందు అయ్యర్‌ను కోల్‌కతా రిలీజ్ చేసింది. వాస్తవానికి అతన్ని రిలీజ్ చేసేందుకు ఇష్టం లేకపోయినా.. మెగా వేలంలోకి వెళ్లాలన్న అతని కోరికను కేకేఆర్ నెరవేర్చే ప్రయత్నం చేసింది. వేలంలో తిరిగి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినా.. పంజాబ్ కింగ్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. తాజాగా ఆ జట్టుకు కెప్టెన్ కోసం వెతుకుతున్నది. గతవారం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన వేలంలో వెంకటేశ్ అయ్యర్‌ను రూ.23.75కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే, వెంకటేశ్ అయ్యర్‌ని కెప్టెన్‌గా చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే, తాజాగా టీమ్ మేనేజ్మెంట్ మరో ఆటగాడికి కెపెన్సీ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. అతనెవరో కాదు అజింక్యా రహానె. రూ.1.50కోట్ల బేస్ ప్రైస్‌తో రహానేనె కోల్‌కతా ఫ్రాంచైజీ వేలంలో చివరగా కొనుగోలు చేసింది.
Rahane
గతంలో రహానే పలు టోర్నీలో వివిధ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతేకాదు చాలాసార్లు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబయి జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఐపీఎల్లో 2018, 2019 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్‌కు రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. రహానెకు కెప్టెన్సీలో మంచి అనుభవం ఉంది. వేలంలో కేకే కెప్టెన్సీ కోసం బలమైన ఆటగాడిని కొనుగోలు చేయలేకపోయింది. తాజాగా ఈ బాధ్యతను రహానేకి అప్పగించాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేకేఆర్ కెప్టెన్సీ బాధ్యతలను రహానేకు అప్పగించేందుకు 90శాతం అవకాశం ఉంది. అంతకుముందు వెంకటేశ్ అయ్యర్ కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి కెప్టెన్ కావాలనే కోరికనే వెంకటేశ్ అయ్యర్ వ్యక్తం చేశాడు. కెప్టెన్సీ అనేది ఓ పదవి కాదని తాను నమ్ముతున్నానని.. కానీ, నాయకుడు జట్టుకోసం ఆడగల, సహకారం అందించగలడని అందరూ భావించేలా వాతావరణాన్ని సృష్టించే వ్యక్తని పేర్కొన్నాడు. తనకు ఆ బాధ్యతలు అప్పగిస్తే సంతోషిస్తానని చెప్పుకొచ్చాడు.