ఈసారి రియాద్‌లో?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలాన్ని గతేడాది దుబాయ్‌లో అట్టహాసంగా నిర్వహించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ ఏడాది జరగాల్సి ఉన్న మెగా ఆక్షన్‌ను మరోసారి అరబ్బుల అడ్డాలోనే జరిపించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం.
- నవంబర్ నెలాఖరున ఐపీఎల్ వేలం!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలాన్ని గతేడాది దుబాయ్‌లో అట్టహాసంగా నిర్వహించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ ఏడాది జరగాల్సి ఉన్న మెగా ఆక్షన్‌ను మరోసారి అరబ్బుల అడ్డాలోనే జరిపించేందుకు ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. ఐపీఎల్-2025 వేలాన్ని సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో నిర్వహించనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. మెగా వేలానికి సంబంధించి తేదీలపై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయకపోయినప్పటికీ నవంబర్ 24, 25 తేదీలలో ఆక్షన్‌ను నిర్వహిస్తామని అన్ని ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఇది వరకే సమాచారం అందించినట్టు తెలుస్తోంది.
రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ క్రికెటర్లు ఈసారి వేలంలోకి వస్తుండటంతో వేలం ప్రక్రియపై ఆసక్తి మరింత పెరిగింది. ఇటీవలే పది ఫ్రాంచైజీలు వచ్చే సీజన్లో తాము అట్టిపెట్టుకోబోయే ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. రిటెన్షన్‌లో ఫ్రాంచైజీలు 46 మంది ఆటగాళ్లకు రూ. 558.5 కోట్లు ఖర్చు చేశాయి.
204 స్లాట్స్ అందుబాటులో ఉన్న వేలంలో రిటెన్షన్‌కు పోగా మరో రూ. 641.5 కోట్ల నగదు ఫ్రాంచైజీల వద్ద ఉంది. వేలంలో ఏ ఆటగాడు ఎంత దక్కించుకుంటానే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే సరిగ్గా వేలం జరిగే సమయానికే భారత క్రికెట్ జట్టు ఆసీస్ టూర్లో తొలి టెస్టు (నవంబర్ 22 నుంచి ప్రారంభం) ఆడనున్న నేపథ్యంలో ప్రసారాల్లో ఇబ్బందులు తలెత్తకుండా మధ్యాహ్నం సమయంలో వేలం నిర్వహించనున్నట్టు సమాచారం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

