IPL Auction 2024: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు ఆస్ట్రేలియా బౌలర్ల వెంట పడ్డాయి. వారిపై కోటానుకోట్లు కుమ్మరించాయి. ఆస్ట్రేలియా ప్లేయర్ అయి ఉండి.. అందునా బౌలర్ అయితే అతడు జాక్‌పాట్ కొట్టాల్సిందే అన్న రేంజ్లో వేలం జరుగుతోంది. ఐపీఎల్లో ఇప్పటివరకూ కనివినీఎరుగని రీతిలో రూ. 24.75 కోట్లు దక్కించుకున్న మిచెల్ స్టార్క్‌తో పాటు ఆసీస్ జట్టు సారథి పాట్ కమిన్స్ కూడా రూ. 20.5 కోట్లు జేబులో వేసుకున్నాడు. స్టార్క్‌ను కేకేఆర్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఈ ఇద్దరితో మరో కంగారూ పేసర్ స్పెన్సర్ హెన్రీ జాన్సన్ కూడా వేలంలో జాక్‌పాట్ కొట్టాడు. 28 ఏండ్ల ఈ అడిలైడ్ బౌలర్‌ను గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ. 10 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. రూ. 50 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన జాన్సన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడ్డాయి. చివరికి అతడిని గుజరాత్ భారీ ధరతో సొంతం చేసుకుంది. ఈ ఏడాదే ఆసీస్ జట్టు తరఫున అంతర్జాతీయ స్థాయిలో అరంగేట్రం చేసిన ఈ పేసర్.. ఇప్పటివరకూ టీ20 (లీగ్) క్రికెట్లో 20 మ్యాచ్‌లు 17 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ తరఫున రెండు టీ20లు ఆడిన అతడు రెండు వికెట్లు తీశాడు.
Spencer Johnson sold to Gujarat for 10 crore.
– Base price was just 50 Lakhs. pic.twitter.com/O06ld3zagB
— Johns. (@CricCrazyJohns) December 19, 2023
స్టార్క్, కమిన్స్, జాన్సన్తోనే ఈ లిస్ట్ ఆగిపోలేదు. మరో ఆసీస్ పేసర్ జై రిచర్డ్సన్ కూడా వేలంలో ఎవరూ ఊహించని ధర దక్కించుకున్నాడు. కోటిన్నర రూపాయల బేస్ ప్రైస్‌తో ఉన్న రిచర్డ్సన్ను వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్.. రూ. 5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.
Can’t wait 😁😁😁😁 https://t.co/0nrQT97lQj
— Jhye Richardson (@jhyericho) December 19, 2023