IPL Auction 2024: భారత క్రికెట్లో పసిడి సిరులు పండిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరో సీజన్‌కు సిద్ధమవుతున్నది. వచ్చే ఏడాది మార్చి నుంచి జరుగబోయే 17వ సీజన్‌కు ముందు పది ఫ్రాంచైజీలు తమ జట్లలో కూర్పు కోసం నిర్వహించబోయే ఐపీఎల్ మినీ వేలానికి సర్వం సిద్ధమైంది. ఐపీఎల్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి భారత్ బయట వేలం ప్రక్రియ జరుగనుండటం గమనార్హం. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఇటీవలే రిటెన్షన్ ప్రక్రియ ముగియగా పది ఫ్రాంచైజీలు పలువురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుని వద్దనుకున్నవారిని వేలానికి వదిలేశాయి. వారితో పాటు కొత్తగా వచ్చే ఆటగాళ్లకు డిసెంబర్ 19న కీలకం కానుంది. మంగళవారం దుబాయ్ లోని కోకోకోలా ఎరెనా వేదికగా ఐపీఎల్ – 2024 మినీ వేలం జరుగనుంది.
77 స్థానాలు.. 333 మంది ఆటగాళ్లు..
రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత పది జట్లలో కలిపి 77 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. 77లో 30 స్లాట్స్ ఓవర్సీస్ ప్లేయర్స్వి. 333 మంది ఆటగాళ్లలో 214 మంది భారత్ నుంచి ఉండగా 119 మంది విదేశీ ప్లేయర్లున్నారు. మొత్తంగా 333 మందిలో 116 మంది క్యాప్డ్ ప్లేయర్స్ కాగా 215 మందీ అన్క్యాప్డ్ ఆటగాళ్లే..
ఏ ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత నగదు..?
ఐపీఎల్ – 2024 వేలంలో పది ఫ్రాంచైజీలు 77 బెర్తుల కోసం 262.95 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఆయా జట్ల పర్స్‌లో ఉన్న నగదు వివరాలు..
గుజరాత్ టైటాన్స్ – రూ. 38.15 కోట్లు
సన్ రైజర్స్ హైదరాబాద్ – రూ. 34 కోట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ – రూ. 32.7 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్ – రూ. 31.4 కోట్లు
పంజాబ్ కింగ్స్ – రూ. 29.1 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 28.95 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ. 23.25 కోట్లు
ముంబై ఇండియన్స్ – రూ. 17.75 కోట్లు
రాజస్తాన్ రాయల్స్ – రూ. 14.5 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్ – రూ. 13.15 కోట్లు
Raise your hand if your #IPL team will be shopping for one of these bowlers 🙋 🛍️#IPLAuction pic.twitter.com/zO8NBIvLyc
— IndianPremierLeague (@IPL) December 17, 2023
ఏ జట్టుకు ఎన్ని స్లాట్స్..
మొత్తం 77 స్లాట్స్ అందుబాటులో ఉన్న వేలంలో ఆయా ఫ్రాంచైజీల వద్ద ఉన్న బెర్తుల వివరాలు.. చెన్నై (6.. ఇందులో ఓవర్సీస్ స్లాట్స్ ౩), గుజరాత్ టైటాన్స్ (8.. ఓవర్సీస్ 2), లక్నో (6.. ఓవర్సీస్ 2), పంజాబ్ (8.. ఓవర్సీస్ 2) , కోల్‌కతా (12.. ఓవర్సీస్ 4), ఢిల్లీ (9.. ఓవర్సీస్ 4), ముంబై (8.. ఓవర్సీస్ 4), బెంగళూరు (6.. ఓవర్సీస్ 3), రాజస్తాన్ (8.. ఓవర్సీస్ 3), హైదరాబాద్ (6.. ఓవర్సీస్ 3)
కొత్త యాక్షనీర్..
ఐపీఎల్ యాక్షన్ అనగానే గుర్తొచ్చే పేరు రిచర్డ్ మ్యాడ్లీ.. సుమారు దశాబ్దకాలానికి పైగా ఐపీఎల్లో ఆయనే వేలం నిర్వహించేవారు. కానీ 2018 నుంచి హ్యూజ్ ఎడ్మాడెస్ ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. అయితే ఈసారి ఈ ఇద్దరినీ కాదని భారత్‌కే చెందిన మల్లికా సాగర్‌ను ఆక్షనీర్‌గా నియమించింది. ఆమె గత రెండు సీజన్లుగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలాన్ని విజయవంతంగా నిర్వహించింది.
వేలం జరిగేది ఎక్కడ..? ఎప్పుడు..?
– డిసెంబర్ 19 (మంగళవారం)న దుబాయ్‌లోని కోకోకోలా ఎరెనాలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు వేలం మొదలవనుంది.
Just a sleep away 🥳#IPLAuction | #IPL pic.twitter.com/jIqI78aTgb
— IndianPremierLeague (@IPL) December 18, 2023
లైవ్ చూడటమెలా..?
– టీవీలలో చూడాలనుకుంటే ఐపీఎల్ వేలాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. మొబైల్స్‌లో వీక్షించాలనుకుంటే జియో సినిమా యాప్‌లో ఉచితంగానే ఆక్షన్ ప్రక్రియను చూడొచ్చు.