PBKS Release List | ఐపీఎల్ 2026 సీజన్ రిటెన్షన్‌కు గడువు దగ్గరపడుతున్నది. ఫ్రాంచైజీలు తమ తుది జాబితాను సిద్ధం చేయడంలో బిజీబిజీగా ఉన్నాయి. గత సీజన్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ సైతం (PBKS) జట్టును మరింత పటిష్టం చేయడంపై దృష్టి పెట్టింది. కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టు 2025 సీజన్లో అద్భుతంగా రాణించి ఫైనల్ వరకు చేరింది. ఫైనల్లో ఆర్సీబీ చేతిలో కేవలం ఆరు పరుగులు తేడాతో ఓడిపోయింది. పలు నివేదికల ప్రకారం.. పంజాబ్ కింగ్స్ కీలక ఆటగాళ్లను జట్టులో కొనసాగించనున్నది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, ఆల్ రౌండర్ శశాంక్, స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వంటి కీలక ఆటగాళ్లు అంటిపెట్టుకోనున్నది.
అయ్యర్ గత సీజన్లో 604 పరుగులతో జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ నిలకడగా రాణించి.. పంజాబ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. శశాంక్ సింగ్ జట్టుకు అత్భుతమైన ముగింపుతో విజయాలను అందించాడు. తనదైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. వీరితో పాటు ప్రభ్‌సిమ్రాన్‌సింగ్, ప్రియాంష్ ఆర్య వంటి యువ ఆటగాళ్లను సైతం పంజాబ్ నిలుపుకునే అవకాశం ఉంది. ప్రయాంష్ దూకుడు బ్యాటింగ్‌తో జట్టుకు ఓపెనింగ్‌లో కొత్త శక్తి నింపినట్లయ్యింది. అయితే, పంజాబ్ కింగ్స్‌కు అతిపెద్ద సవాల్ విదేశీ ఆటగాళ్లే.
గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్ వంటి సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శనపై జట్టు ఏమాత్రం సంతృప్తిగా లేదు. గత కొద్ది సీజన్లుగా మ్యాక్స్‌వెల్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. 2025 మెగా వేలంలో మార్కస్ స్టోయినిస్‌ను పంజాబ్ రూ.11కోట్లు పోసి కొనుగోలు చేసింది. అయితే, ఈ ప్లేయర్ జట్టు అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో పంజాబ్ వారిద్దరిని విడుదల చేసి.. వారి స్థానంలో ఇతర క్రికెటర్లను తీసుకునేందుకు యోచిస్తుంది. వీరితో పాటు ఆరోన్ హార్డీ, ముషీర్ ఖాన్ వంటి ఆటగాళ్లకు సైతం విడుదల చేసే ఛాన్స్ ఉంది. హార్డీ గత సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. ముషీర్ కేవలం ఒకే మ్యాచ్‌లో కనిపించాడు. ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 15-16 తేదీల్లో అబుదాబీలో జరిగే అవకాశం ఉంది.
ప్రాబబుల్ రిటైన్డ్ ప్లేయర్స్ : శ్రేయాస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, విజయ్‌కుమార్ వ్యాషాక్, యశ్ ఠాకూర్, హర్‌ప్రీత్ బ్రార్, విష్ణు వినోద్, మార్కో జాన్సెన్, జోష్ ఇంగ్లిస్, జేవియర్ బార్ట్లెట్, కుల్దీప్ సేన్, ప్రియాలా అవినాష్, సూర్యాంశ్ షెడ్జ్, ప్రవీణ్ దూబే, అజ్మతుల్లా ఒమర్జాయ్, లాకీ ఫెర్గూసన్.
ప్రాబబుల్ రిలీజ్డ్ ప్లేయర్స్ : విడుదలయ్యే సంభావ్య ఆటగాళ్లు: హర్నూర్ సింగ్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, ఆరోన్ హార్డీ, ముషీర్ ఖాన్.