అబుదాబి: 2026 ఐపీఎల్ సీజన్‌కు డిసెంబర్ 16వ తేదీన ఆటగాళ్ల వేలం(IPL 2026 Auction) జరగనున్నది. ఆ వేలంలో సుమారు 350 క్రికెటర్లు పాల్గొననున్నారు. దాంట్లో 240 మంది భారతీయ క్రికెటర్లు ఉన్నారు. టీ20 క్రికెట్ లీగ్ కోసం అబుదాబిలో వేలం జరగనున్నది. సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డీకాక్.. వేలం తుది లిస్టులో చేరాడు. వన్డే రిటైర్మెంట్ నుంచి వెనక్కి వచ్చిన అతను.. తాజా భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. కోటి బేస్ప్రైజ్పై అతను అందుబాటులో ఉన్నాడు. ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా 2 కోట్ల బేస్ప్రైజ్పై వేలానికి రెఢీ అయ్యాడు. 2021లో చివరిసారి స్టీవ్ స్మిత్ ఐపీఎల్ ఆడాడు.
వాస్తవానికి ఐపీఎల్ ప్లేయర్ ఆక్షన్ కోసం 1390 మంది రిజిస్టర్ చేసుకున్నారు. దాంట్లో నుంచి 350 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. తొలి సెట్లో భారత బ్యాటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్.. 75 లక్షల బేస్ప్రైజ్పై వేలంలో నిలిచారు. ఇక ఆసీస్ ప్లేయర్ కెమరూన్ గ్రీన్, జేక్ ఫ్రేజర్ మెక్‌గార్క్, కివీస్ ప్లేయర్ డేవాన్ కాన్వే, సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ 2 కోట్ల బేస్ప్రైజ్పై లిస్టులో ఉన్నారు. తాజాగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో అత్యధిక రన్స్ చేసిన కునాల్ చండేలా, వికెట్లు తీసిన అశోక్ కుమార్ 2 కోట్ల బేస్‌ప్రైజ్‌లో ఉన్నారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఈసారి ప్లేయర్ల కోసం 64.3 కోట్లతో వేలంలో పాల్గొననున్నది. అయిదు సార్లు టోర్నీ గెలిచిన చెన్నై జట్టు 43.4 కోట్లతో , సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 25.5 కోట్ల పర్స్‌మనీతో వేలంలో పాల్గొననున్నాయి. ఈసారి వేలం కోసం 21 మంది ఇంగ్లండ్ క్రికెటర్లు పోటీపడుతున్నారు. వికెట్ కీపర్, బ్యాటర్ జేమీ స్మిత్, గస్ అట్కిన్సన్, లివింగ్‌స్టోన్, బెన్ డక్కెట్ రేసులో ఉన్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన 19 మంది ఆటగాళ్లకు వేలంలో పాల్గొంటున్నారు. దాంట్లో గ్రీన్ టాప్ లిస్టులో ఉన్నారు. జోష్ ఇంగ్లిష్, షార్ట్, కూపర్ కొన్నలీ, వెబ్‌స్టర్ కూడా ఉన్నారు. 15 మంది దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డీకాక్, మిల్లర్ ఉన్నారు. ఫాస్ట్ బౌలర్లు నోర్జే, లుంగి ఎంగిడి, గెరాల్డ్ కోయిట్జ్, ముల్డర్ ఉన్నారు. వెస్టిండీస్‌కు చెందిన అల్జరీ జోసెఫ్, షామర్ జోసెఫ్, అకీమ్ అగస్టీ, షాయ్ హోప్, రోస్టన్ చేజ్‌తో పాటు 9 మంది ఉన్నారు. శ్రీలంక క్రికెటర్లలో హసరంగ, దునిత్ వెల్లలగే, తీక్షణ, ట్రావీన్ మాథ్యూ, నిషాంక, కుశాల్ మెండిస్, పెరీరా ఉన్నారు.
కాన్వే, రవీంద్రతో పాటు 16 మంది కివీస్ క్రికెటర్లు వేలంలో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన గుర్బాస్, నవీన్ ఉల్ హక్‌తో పాటు మొత్తం 19 మంది ప్లేయర్లు వేలం జాబితాలో ఉన్నారు.
🚨 NEWS 🚨#TATAIPL 2026 Player Auction List announced.
A total of 350 players will go under the hammer at the upcoming auction in Abu Dhabi on 16th December.
All the details 🔽 | #TATAIPLAuctionhttps://t.co/S4hQRUa2w7
— IndianPremierLeague (@IPL) December 9, 2025