IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ అట్టహాసంగా మొదలైంది. ఓ వైపు జట్లు ధనాధన్ క్రికెట్లో అధరగొడుతుండగా.. వ్యూస్‌లో జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ వ్యూయర్షిప్లో సరికొత్త రికార్డులను సృష్టించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యూయర్షిప్ను సాధించాయి. ఈ సీజన్ తొలి వారంలోనే జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కు 4,956 కోట్ల నిమిషాల వ్యూయర్షిప్ దక్కింది. ఇదే ఇప్పటి వరకు రికార్డు కావడం విశేషం. జియో హాట్‌స్టార్‌లో తొలి మూడు మ్యాచ్‌ల వ్యూయర్షిప్ సంఖ్య మునుపటి సీజన్ కంటే 40 శాతం ఎక్కువగా ఉండడం విశేషం. టాటా ఐపీఎల్ తొలి వారంలో మొత్తం మొత్తం 137 కోట్ల వ్యూస్ వచ్చాయి.
స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన బార్క్ (BARC).. మ్యాచ్‌లను మొదటి వారాంతంలో 25.3 కోట్ల మంది వీక్షించగా.. 2,770 కోట్ల నిమిషాల వ్యూయర్షిప్ దక్కింది. ఇది గతేడాది కంటే 22శాతం ఎక్కువ. టీవీ, డిజిటల్లో కలిపి 4,956 కోట్ల నిమిషాల వాచ్‌టైమ్ నమోదైంది. జియోహాట్‌స్టార్‌లో మొదటి మూడు మ్యాచుల డిజిటల్ వ్యూయర్షిప్ గతేడాది కంటే.. 40శాతం ఎక్కువ. అయితే, ఐపీఎల్ 2025 తొలి మూడు మ్యాచులకు 137 కోట్ల వ్యూస్ రాగా.. ఒకేసారి గరిష్ఠంగా 3.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. బార్క్ డేటా.. ప్రకారం టీవీ వ్యూయర్‌షిప్‌లోనూ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. మొదటి మూడు మ్యాచుల సగటును పరిశీలిస్తే గత సీజన్ కంటే 39శాతం ఎక్కువగా. ఐపీఎల్ ఈ నెల 22న శనివారం ప్రారంభమైన విషయం తెలిసిందే.
అయితే, ఈ సీజన్లో తొలి డబుల్ హెడర్ మ్యాచ్ ఆదివారం జరిగింది. ఈ మూడు మ్యాచుల గణాంకాలను పరిశీలిస్తే.. ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ స్టార్లు ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చిన విషయం తెలిసిందే. హీరోయిన్ దిశా పటానీ, సింగర్ శ్రేయ ఘోషల్, కరణ్ ఔజ్లా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇక విరాట్ కోహ్లీ, రింకు సింగ్‌లతో కలిసి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సైతం డ్యాన్ చేశారు. కోల్‌కతాలో జరిగిన తొలి మ్యాచ్‌లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఆదివారం జరిగిన డబుల్ హెడర్ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోర్ సాధించింది. అదే రోజు జరిగిన డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది.