Sunil Gavaskar | ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ రేసులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బలమైన పోటీదారని భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నారు. ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ అద్భుతంగా రాణిస్తున్నది. ఆడిన పది మ్యాచుల్లో ఏడు విజయాలు, మూడో ఓటములతో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడోస్థానంలో ఉన్నది. ఈ సీజన్లో ఆర్సీబీ ఫుల్ ఫామ్‌లో కనిపిస్తున్నది. గతం కంటే భిన్నంగా ఈ సారి అన్నిరంగాల్లో సమతూకంగా కనిపిస్తున్నది. టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దేవ్‌దత్ పడిక్కల్, జోష్ హాజిల్‌వుడ్ రూపంలో ఆ జట్టుకు మ్యాచ్ విన్నింగ్ ఆటగాళ్లు ఉన్నారు. జట్టు ఫామ్ గురించి మాట్లాడితే.. ముంబై ఇండియన్స్ మాత్రమే ఆర్సీబీ ఆల్ రౌండ్ బలానికి దగ్గరగా ఉన్న జట్టు గవాస్కర్ పేర్కొన్నారు. అయితే, ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్‌కు బలమైన పోటీదారుగా గవాస్కర్ అభివర్ణించారు.
స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘ఆర్సీబీ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుంది. అద్భుతంగా ఫీల్డింగ్ కూడా చేస్తుంది. ముంబయి జట్టుకు దగ్గరగా ఉంది. ముంబయి ఇప్పుడే వరుస విజయాలు సాధిస్తుంది. మరో మూడు కీలకమైన మ్యాచ్‌లు ఆ జట్టుకు ఉన్నాయని.. అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తారా? అన్నది ప్రశ్న. ఈ జోరును ఎలా కొనసాగించాలి అనేది ముఖ్యం. కానీ, ఆర్సీబీ ఖచ్చితంగా టైటిల్ పోరులో బలమైన జట్టు. సొంత మైదానంలో రికార్డు బాగాలేదు’ అన్నారు. ఆర్సీబీ ఇప్పటి వరకు సొంత మైదానంలో జరిగిన మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఇంకా ఆర్సీబీకి మూడు మ్యాచులు మిగిలి ఉన్నాయి. ఇందులో రెండు ఐపీఎల్ 2025 సీజన్లో ఒకసారి ఓడిన జట్లతోనే ఉన్నాయి. ఆర్సీబీకి నాలుగు మ్యాచుల్లో మూడు సొంత మైదానాల్లోనే ఉన్నాయి. చిన్నస్వామి మైదానంలో ఆర్సీబీ రికార్డును పరిశీలిస్తే.. ఇక్కడ రాణించడం ఆ జట్టుకు సవాల్‌గా మారింది. ఆర్సీబీ సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ శనివారం తలపడనున్నది. మరి మ్యాచ్‌లో విజయం సాధిస్తుందా? లేదా? చూడాల్సిందే.