Faf du Plessis | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త వైస్ కెప్టెన్‌ను ప్రకటించింది. ఇటీవల కెప్టెన్‌గా టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌గా నియమించిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్గా నియమించింది. ఎక్స్‌లో వీడియో పోస్ట్‌తో ప్రకటించింది. ‘వైస్ కెప్టెన్ ఫోన్ చేస్తున్నడు.. మీ ఫోన్స్ లిఫ్ట్ చేయండి’ అనే క్యాప్షన్‌తో డీసీ వీడియోను షేర్ చేసింది. ఇదిలా ఉండగా.. బ్యాటింగ్ లైనప్‌లో డు ప్లెసిస్ స్థానంపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌తో కలిసి ఓపెనింగ్ చేయవచ్చని పలువురు భావిస్తుండగా.. కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ రావొచ్చని పలువురు అంచనా వేస్తున్నారు.
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గతేడాది సీజన్లో కెప్టెన్‌గా వ్యవహరించారు. మెగా వేలానికి ముందు ఆర్సీబీ నుంచి విడుదలయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 40 ఏళ్ల సీనియర్ ఆటగాడిపై అంచనాలతో రూ.2కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే అతనిపై నమ్మకంతో వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. వాస్తవానికి డు ప్లెసిస్ 2012లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2021 సీజన్ వరకు ఆ ఫ్రాంజైసీతోనే ఉండగా.. 2022 నుంచి 24 వరకు మూడు సీజన్లలో రాయల్ చాలెంజర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
Pick up your phones, it’s your vice-captain calling 💙❤️ pic.twitter.com/W3AkYO4QKZ
— Delhi Capitals (@DelhiCapitals) March 17, 2025