IPL 2025 Auction | భారతీయ క్రికెట్ అభిమానులకు కన్నుల పండువగా నిలిచే ఐపీఎల్.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు జట్ల ఎంపిక కోసం జరిగే వేలం అంటే అంతే క్రేజీ. ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో ప్రతి ఏటా ఆశ్చర్యకర ఘటనలు నమోదు చేసుకుంటూనే ఉన్నాయి. అన్ క్యాప్డ్ ప్లేయర్ మీద అసాధారణ మొత్తం చెల్లిస్తుంటాయి ఫ్రాంచైజీలు. కానీ అనుభవం గల ప్లేయర్ మాత్రం అమ్ముడు పోక పోవడం విచిత్రంగా ఉంటుంది. ఐపీఎల్ 2025 కోసం ఆదివారం సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలో జరిగిన తొలి రోజు వేలం కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు.
టీం ఇండియా ప్లేయర్ దేవ్ దత్ పడిక్కల్ కోసం ఏ ఫ్రాంఛైజీ బిడ్ దాఖలు చేయలేదు. లెఫ్ట్ హ్యాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్ పడిక్కల్.. ప్రస్తుతం టీం ఇండియాకు ప్రాతినిధ్యం వహించట్లేదు కానీ.. దేశవాళీ క్రికెట్ లో కర్ణాటకకు ఆడుతున్నాడు. ఈ 24 ఏండ్ల కుర్రాడు ఐపీఎల్ టోర్నీలో 1500కి పైగా పరుగులు చేశాడు. ఆయన స్ట్రైక్ రేట్ 123 పరుగులు. గత సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్, 2023లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలకు ఆడాడు. 200లకు పైగా పరుగులు చేసిన అతడికి 2020, 2021 బెస్ట్ సీజన్లుగా నిలిచాయి. ప్రస్తుత వేలంలో అత్యధికంగా రిషబ్ పంత్ రూ.27 కోట్లు, శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లు పలికారు. కానీ రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ మాదిరిగా స్టార్ ప్లేయర్ అయినా దేవ్ దత్ పడిక్కల్ మాత్రం ఎంపిక కాలేదు. ఈ సీజన్లో ఎంపిక కానీ పడిక్కల్ ఒక్కడే కావడం గమనార్హం.
2009 నుంచి ఐపీఎల్ లో భాగస్వామిగా ఉన్న డేవిడ్ వర్నర్ రెండు టీంలకు ఆడాడు. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్, తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మూడుసార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న వార్నర్.. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారధిగా ఐపీఎల్ టైటిల్ తెచ్చి పెట్టాడు. ఐపీఎల్ లో బుల్ గా చెప్పుకునే వార్నర్ 6565 పరుగులు చేశాడు. ఆయన స్ట్రైక్ రేట్ 140 పరుగులు.