IPL 2025 Auction : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం మొదలైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా వేలం జరుగుతోంది. ఆక్షన్‌లో మొదటి ప్లేయర్‌గా భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ పేరు వచ్చింది. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో అర్ష్‌దీప్ వేలంలోకి వచ్చాడు. మొదట్లో అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి.
మధ్యలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్‌లు బిడ్ వేశాయి. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ పోటీపడ్డాయి. ఆఖరికి అతడిని ఆర్టీఎమ్ కార్డును ఉపయోగించి పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లకు దక్కించుకుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కాగిసో రబాడను సైతం పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. అతడి కోసం ఆర్సీబీ, గుజరాత్, ముంబైలు పోటీ పడగా ఆఖరి పంజాబ్ కింగ్స్ 10.75 కోట్లకు దక్కించుకుంది.