Sun Risers Hyderabad | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభానికి మరికొద్దిగంటల ముందు మాజీ ఛాంపియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కొత్త ఆంథెమ్‌ను విడుదల చేసింది. ‘సన్ రైజర్స్ మేము బ్రో.. పక్కా ఇంకో రేంజ్ బ్రో..’ అంటూ సాగే ఈ పాట మాస్ బీట్తో ఆరెంజ్ ఆర్మీ అభిమానులను అలరిస్తోంది. బుధవారం ఎస్ఆర్హెచ్.. తమ ట్విటర్ (ఎక్స్) వేదికగా విడుదల చేసింది. క్యాచీ లిరిక్స్‌తో పాటు మాస్ బీట్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.
ఈ వీడియోలో ఎస్ఆర్హెచ్ సారథి పాట్ కమిన్స్, ఎయిడెన్ మార్క్రమ్, భువనేశ్వర్ కుమార్, ట్రావిస్ హెడ్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ వర్మ, ఉమ్రాన్ మాలిక్, రాహుల్ త్రిపాఠిలతో పాటు ఇతర క్రికెటర్లూ కనిపించారు. పాటలో తెలుగు నేటివిటీకి తగ్గట్టూ హైదరాబాద్‌లోని చారిత్రక ప్రదేశాలైన చార్మినార్, మొజంజాహి మార్కెట్, దుర్గం చెరువులను చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
𝑺𝒖𝒏𝑹𝒊𝒔𝒆𝒓𝒔 𝒎𝒆𝒎𝒖 𝒃𝒓𝒐,
𝑷𝒂𝒌𝒌𝒂 𝒊𝒏𝒌𝒐 𝒓𝒂𝒏𝒈𝒆 𝒃𝒓𝒐🧡Our new anthem is here to set your playlist on fire🔥#SRHAnthem2024 #PlayWithFire #OrangeArmy pic.twitter.com/U4xRxhYfGv
— SunRisers Hyderabad (@SunRisers) March 20, 2024
ఐపీఎల్ -17లో హైదరాబాద్.. మార్చి 23న టైటిల్ వేట మొదలుపెట్టనుంది. ఫస్ట్ షెడ్యూల్ (మార్చి 22 నుంచి ఏప్రిల్ 07 వరకూ) హైదరాబాద్ తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్ వేదికగా ఆడనుంది. ఆ తర్వాత ఈనెల 27న సొంత గ్రౌండ్ (ఉప్పల్) లో ముంబై ఇండియన్స్‌తో రెండో మ్యాచ్ ఆడాల్సి ఉండగా గుజరాత్ టైటాన్స్‌తో ఈనెల 31న అహ్మదాబాద్‌లో మ్యాచ్ ఆడుతుంది. ఏప్రిల్ 05న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉప్పల్లోనే తలపడనుంది.
Mark your dates, #OrangeArmy 😍
We start our 🔥 days against the Knights 🧡💜
And we’ll see you at Uppal on the 27th 😍#IPL2024 #IPLSchedule pic.twitter.com/j9kuIIDyfE
— SunRisers Hyderabad (@SunRisers) February 22, 2024