IPL 2024 | పేర్లు మారినా కప్పు కొట్టలే.. ఆర్సీబీ ఆ చరిత్రను తిరగరాసేనా..?
IPL 2024 | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మంగళవారం తన పేరులోని రెండు అక్షరాలను మార్చుకున్నది. ఇంగ్లీష్‌లో ‘Royal Challengers Bangalore'గా ఉన్న ఆ జట్టు పేరును 'Royal Challengers Bengaluru’గా మార్చుకుంది. ఇలా పేర్లు మార్చుకున్న జట్టు ఆర్సీబీ ఒక్కటే కాదు.
IPL 2024 | ఐపీఎల్ పుట్టినప్పట్నుంచి (2008) ఉన్న జట్లలో ఒకటైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మంగళవారం తన పేరులోని రెండు అక్షరాలను మార్చుకున్నది. ఇంగ్లీష్‌లో ‘Royal Challengers Bangalore’గా ఉన్న ఆ జట్టు పేరును ‘Royal Challengers Bengaluru’గా మార్చుకుంది. ఇలా పేర్లు మార్చుకున్న జట్టు ఆర్సీబీ ఒక్కటే కాదు. బెంగళూరుతో పాటు మరో రెండు జట్లూ ఈ జాబితాలో ఉన్నాయి. ఢిల్లీ, పంజాబ్‌లు కూడా తమ ఫ్రాంచైజీల పేర్లు మార్చుకున్నాయి. యాధృశ్చికంగా అవి కూడా ఆర్సీబీ మాదిరిగానే ఇంతవరకూ ఐపీఎల్లో కప్ కొట్టకపోవడం గమనార్హం.
ఢిల్లీ క్యాపిటల్స్..
ఐపీఎల్లో పేరు మార్చుకున్న తొలి జట్టు ఢిల్లీ క్యాపిటల్స్.. గతంలో ‘ఢిల్లీ డేర్ డెవిల్స్’గా ఉన్న ఆ జట్టు.. 2018 సీజన్లో ‘ఢిల్లీ క్యాపిటల్స్’గా పేరు మార్చుకుంది. పేరు మార్చుకున్న తర్వాత రెండో సీజన్ (2020)లో ఢిల్లీ ఈ లీగ్‌లో ఫైనల్ చేరింది. అయితే ఫైనల్ చేరినా ఆ జట్టుకు ముంబై ఇండియన్స్ చేతిలో పరాభవం తప్పలేదు. ఇక 2020 తర్వాత ఢిల్లీ మళ్లీ ఫైనల్ దిశగా అడుగులు వేయలేదు.
పంజాబ్ కింగ్స్..
సీజన్‌కు ఒక సారథిని మార్చే జట్టుగా ముద్రపడిపోయిన పంజాబ్ కింగ్స్.. 2014 తర్వాత మళ్లీ ఫైనల్‌కే రాలేదు. అయితే ఐపీఎల్ 14వ సీజన్ (2021)లో పంజాబ్ తన పేరు మార్చుకుంది. గతంలో ‘కింగ్స్ లెవెన్ పంజాబ్’గా ఉన్న ఆ జట్టు.. ఆ సీజన్ నుంచి ‘పంజాబ్ కింగ్స్’గా మార్చుకుంది. పేరు మారినా ఆ జట్టు తలరాత మాత్రం మారలేదు.
We Play for the Badge ❤️🔥
Presenting jaw dropping clicks from our team photoshoot! More to follow…🔥#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 pic.twitter.com/OEZBYjk1y9
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 20, 2024
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
బెంగళూరు తాజాగా పేరు మార్చినా ఆ జట్టు కూడా ఇంతవరకూ ట్రోఫీ నెగ్గలేదు. 2009, 2011, 2016లలో ఆ జట్టు ఫైనల్ చేరింది. కానీ మూడు సార్లూ ఆ జట్టుకు పరాభవాలే ఎదురయ్యాయి. తాజాగా ఆ ఫ్రాంచైజీకి చెందిన మహిళల జట్టు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ట్రోఫీ నెగ్గిన నేపథ్యంలో మెన్స్ టీమ్ కూడా ఫుల్ జోష్‌లో ఉంది. ఇకనుంచి ఆర్సీబీకి కొత్త అధ్యాయమని కోహ్లీ అంటున్నాడు. ఈ సీజన్లో కప్ కొట్టడమే లేట్ అని ఆ జట్టు అభిమానులు కొండంత ఆశలతో ఉన్నారు. మరి పేరు మార్చుకున్న ఆర్సీబీ.. ట్రోఫీ కొడుతుందా..? లేక పంజాబ్, ఢిల్లీ మాదిరిగానే నిరాశకు గురిచేస్తుందా..? అన్నది త్వరలోనే తేలనుంది.
– హైదరాబాద్ కూడా పేరు మార్చుకున్నా దాని కథ వేరు. గతంలో డెక్కన్ ఛార్జర్స్‌గా ఉన్న హైదరాబాద్.. 2016 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్‌గా మారింది. ఫ్రాంచైజీ పేరుతో పాటు ఓనర్షిప్ కూడా మారింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ నో
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

